Share News

Kumaram Bheem Asifabad- మంత్రి సీతక్కపై ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేస్తాం

ABN , Publish Date - May 14 , 2024 | 11:17 PM

: జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క మండలంలోని బోరిగాంలో ఓటర్లను ప్రలోభపెడుతూ చేసిన అంశంపై ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేస్తానని ఎమ్మెల్యే డాక్టర్‌ హరీష్‌ బాబు తెలిపారు. మంగళవారం స్థానికంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

Kumaram Bheem Asifabad-    మంత్రి సీతక్కపై ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేస్తాం
మాట్లాడుతున్న ఎమ్మెల్యే డాక్టర్‌ పాల్వాయి హరీష్‌బాబు

కాగజ్‌నగర్‌, మే 14: జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క మండలంలోని బోరిగాంలో ఓటర్లను ప్రలోభపెడుతూ చేసిన అంశంపై ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేస్తానని ఎమ్మెల్యే డాక్టర్‌ హరీష్‌ బాబు తెలిపారు. మంగళవారం స్థానికంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సోమవారం పార్లమెంటు ఎన్నికలు కొనసాగుతుండగా, కాగజ్‌నగర్‌ మండలం బోరిగాంలో ఓటర్లను ప్రలోభపెడుతూ ఓట్ల కోసం గ్రామానికి రోడ్డు వేయిస్తానని హామీ ఇవ్వడం సరికాదన్నారు. ఇది పూర్తిగా ఎన్నికల నిబంధనలు అతిక్రమంచడమవుతుందన్నారు. ఇందుకు అన్ని ఆధారాలున్నట్టు వివరించారు. ఈ ఆధారాలతో ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేస్తానని వివరించారు. కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఎన్ని కుట్రలు చేసినా కూడా ఓటర్లు సరైన గుణ పాఠం చెబుతారని తెలిపారు. డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ కోసం మొగ్గు చూపుతున్నట్టు తెలిపారు. బీజేపీ ఓట్లేసేందుకు సహకరించిన ప్రతీ ఒక్కరికి కృతజ్ఙతలు తెలిపారు. ఓట్ల గల్లంతు వ్యవహరంపై కూడా ఎన్నికల అధికారులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తానని తెలిపారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ బీజేపీ గ్రాఫ్‌ గణనీయంగా పెరిగిందన్నారు. కేంద్రంలో ఉన్న పీఎం మోదీ చేసిన సంక్షేమ పథకాలతోనే బీజేపీకి ఆదరణ లభించినట్టు తెలిపారు. ఉమ్మడి జిల్లాలో బీజేపీ సీటు పక్కాగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో బీజేపీ నాయకులు కొంగ సత్యనారాయణ, వీర భధ్రచారి, గోలేం వెంకటేష్‌, ఈర్ల విశ్వేశ్వర్‌ రావు, సిందం శ్రీనివాస్‌తో పాటు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 14 , 2024 | 11:17 PM