షాద్‌నగర్‌ను అభివృద్ధి పరుస్తాం
ABN , Publish Date - Jul 15 , 2024 | 11:16 PM
We will develop షాద్‌నగర్ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పరుస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. Shadnagar
మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
ఆర్వోబీ నిర్మాణానికి రూ. 190 కోట్లు మంజూరు
షాద్‌నగర్, జూలై 15: షాద్‌నగర్ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పరుస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. సోమవారం మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో పలు అభివృద్ధి పనుల్లో పాల్గొనడానికి వెళుతున్న మంత్రులు జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి షాద్‌నగర్ బైపాస్ చౌరస్తాలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలోని చటాన్‌పల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. గతంలో బ్రిడ్జి నిర్మాణం కోసం రూ. 90 కోట్లు మంజూరు చేసిందని, అయితే, ఇప్పుడు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ విజ్ఞప్తి మేరకు రూ. 190 కోట్లు మంజూరు చేశామని మంత్రి చెప్పారు. మరో 15 రోజుల్లో నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. అలాగే రూ.5వేల కోట్లతో హైదరాబాద్- కర్నూల్ వరకు గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణ పనులు కూడా చేపట్టనున్నట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జిల్లా పర్యటనలు చేపట్టారని, అలాగే మంత్రులు కూడా నియోజకవర్గ పర్యటనలు చేపట్టి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి షాద్‌నగర్ నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారని, రోడ్లు, ప్రభుత్వ భవనాల మరమ్మత్తులు, ఆధునీకరణ కోసం అడిగిన వెంటనే నిధులు కేటాయిస్తున్నారని తెలిపారు.