Share News

మేమూ వస్తాం మేడిగడ్డకు..

ABN , Publish Date - Feb 29 , 2024 | 04:58 AM

మేడిగడ్డకు తాము కూడా వస్తామని, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన తప్పులను వివరిస్తామని మల్లన్నసాగర్‌, కొండపోచమ్మ భూనిర్వాసితులు

మేమూ వస్తాం మేడిగడ్డకు..

బీఆర్‌ఎస్‌ తప్పులను వివరిస్తాం

మల్లన్నసాగర్‌, కొండపోచమ్మ భూనిర్వాసితులు

గజ్వేల్‌, ఫిబ్రవరి 28: మేడిగడ్డకు తాము కూడా వస్తామని, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన తప్పులను వివరిస్తామని మల్లన్నసాగర్‌, కొండపోచమ్మ భూనిర్వాసితులు పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించిన బీఆర్‌ఎ్‌సతోపాటు ప్రాజెక్టుకు అనుమతిచ్చిన బీజేపీ నాయకులు ప్రాజెక్టు సందర్శనకు రావాలన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ పట్టణంలో మల్లన్నసాగర్‌, కొండపోచమ్మ భూనిర్వాసితులు హయతోద్దీన్‌, శ్రీనివా్‌సరెడ్డి, తిరుపతి, కరుణాకర్‌, పోచయ్యలు మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం ద్వారా ఏ ఒక్క ఎకరానికీ అదనంగా నీళ్లివ్వలేదన్నారు. బీఆర్‌ఎస్‌ నాయకులు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల్లా భూములను కొనుగోలు చేశారని ఆరోపించారు. అదనపు టీఎంసీ పనులకు అనుమతిలేకున్నా పనులు చేపడుతున్నారన్నారు. కన్నెపల్లి పంప్‌హౌజ్‌ నుంచి గోలివాడ పంప్‌హౌజ్‌ వరకు జరిగిన అన్యాయాలను ప్రజలకు వివరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కేటీఆర్‌ నాయకత్వంలోనే నిర్వాసితులుగా తాము వస్తామని తెలిపారు. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం వెళ్దామని, అక్కడి ప్రజలను అడిగి బీఆర్‌ఎస్‌ మోసాలను తెలుసుకుందామన్నారు. ఎక్కడ ఎంత అవినీతి జరిగిందో ఆధారాలతో సహా బయట పెడతామని చెప్పారు.

Updated Date - Feb 29 , 2024 | 09:41 AM