కులగణనపై కేబినెట్ నిర్ణయాన్ని స్వాగతిస్తాం
ABN , Publish Date - Feb 06 , 2024 | 12:36 AM
తెలంగాణ రాష్ట్రంలో సమ గ్ర కులగణన చేపట్టాలని రాష్ట్ర కేబినెట్‌లో విధానపరమైన నిర్ణయాన్ని ఆమోదించడాన్ని స్వాగతిస్తున్నామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివా్‌సగౌడ్ అన్నారు.
కులగణనపై కేబినెట్ నిర్ణయాన్ని స్వాగతిస్తాం
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివా్‌సగౌడ్
మర్రిగూడ, ఫిబ్రవరి 5: తెలంగాణ రాష్ట్రంలో సమ గ్ర కులగణన చేపట్టాలని రాష్ట్ర కేబినెట్‌లో విధానపరమైన నిర్ణయాన్ని ఆమోదించడాన్ని స్వాగతిస్తున్నామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివా్‌సగౌడ్ అన్నారు. మండలంలోని రాంరెడ్డిపల్లి గ్రామం లో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీ కులగణనపై తీసుకున్న నిర్ణయం భారతదేశంలోనే చరిత్రాత్మకమైనదని, ఇప్పటి వరకు రెండు రాషా్ట్రల్లో బీసీ కులగణన చేపట్టినట్లు తెలిపారు. మూడో రాష్ట్రంగా తెలంగాణ అవతరించనున్నట్లు తెలిపారు. జనాభా దామాషా ప్రకారం రాజకీయం, విద్యారంగంలో రిజర్వేషన్లు లేక పోవడం వల్ల రాష్ట్రంలో బీసీలు నష్టపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ సమాజం తరపున సీఎం రేవంతరెడ్డికి బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, కేబినెట్ మంత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రిజర్వేషన కోల్పోవడం వల్ల 70 సంవత్సరాలుగా బీసీలకు న్యాయబద్ధంగా అందాల్సిన ఫలాలు అందక బీసీలు అభివృద్ధికి నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో బీసీ సంక్షేమ నియోజకవర్గ అధ్యక్షుడు కుక్కడపు ముత్యాలుగౌడ్, పందుల రాములుగౌడ్, పగడాల లింగయ్య, కొలుకులపల్లి యాదయ్య, పగడాల యాదయ్య, మాజీ ఎంపీటీసీ వెంకటంపేట బాలయ్య పలువురు ఉన్నారు.