Share News

మీ ముఖాల్లో చిరునవ్వే మాకు కావాల్సింది

ABN , Publish Date - Apr 02 , 2024 | 11:11 PM

తైబజార్‌ రద్దుతో రైతులు, చిరువ్యాపారులు, వీధుల్లో సరుకులు అమ్ముకునే వారి ముఖాల్లో చిరునవ్వులు మాకు కావాల్సిందని అని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.

మీ ముఖాల్లో చిరునవ్వే మాకు కావాల్సింది
లరైతుబజార్‌, వీధుల్లో చిరువ్యాపారులను పలకరిస్తున్న ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, మునిసిపల్‌ చైర్మన్‌ ఆనంద్‌కుమార్‌

- ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి

- ఇక నుంచి మీకు తైబజారు వేధింపులు ఉండవు

- మార్కెట్‌లో వీధి వ్యాపారులకు పలకరింపు

పాలమూరు, ఏప్రిల్‌ 2 : తైబజార్‌ రద్దుతో రైతులు, చిరువ్యాపారులు, వీధుల్లో సరుకులు అమ్ముకునే వారి ముఖాల్లో చిరునవ్వులు మాకు కావాల్సిందని అని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో వీధుల్లో అమ్ముకునే చిరు వ్యాపారులకు తైబజారు వసూలును ఎమ్మెల్యే యెన్నం రద్దు చేసిన విషయం తెలిసిందే. మంగళవారం జిల్లా కేంద్రంలోని 45వ వార్డులోని రైతుబజార్‌, వీధుల్లో చిరువ్యాపారులను మునిసిపల్‌ చైర్మన్‌ అనంద్‌కుమార్‌ గౌడ్‌తో కలిసి ఎమ్మెల్యే పలకరించారు. ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి తైబజార్‌ రద్దు చేయటం సంతోషమేనా అని రైతులను అడిగి తెలుసుకున్నారు. రైతులను ఈ స్థితిలో చూడటం తనకు సంతోషంగా ఉందన్నారు. మునిసిపల్‌ కౌన్సిల్‌లో చట్టబద్ధంగా తీర్మానం చేసి తైబజార్‌ రద్దు చేశామన్నారు. చిరువ్యాపారుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. మునిసిపాలిటీకి వచ్చే ఆదాయం కంటే పేదవారి ఆత్మగౌరవం మాకు ముఖ్యమన్నారు. తైబజార్‌ పేరుతో వీధి వ్యాపారులు దౌర్జన్యాలకు, వేధింపులకు, అవమానాలకు గురికావటంతో బాధపడటం నిన్నటి మాట అని, నేటినుంచి స్వేచ్ఛగా వ్యాపారం చేసుకుని జీవించడమే అన్నారు. వచ్చే ఏడాదిలోపు మోడల్‌ మార్కె ట్‌గా రూపొందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. నాన్‌వెజ్‌ వ్యాపారులు తీవ్రమైన ఎండకు అనారోగ్య సమస్యలకు గురవుతున్నారని ఎమ్మెల్యే దృష్టికి వ్యాపారులు తీసుకొచ్చారు. నాన్‌వెజ్‌ వ్యాపారులకు తా త్కాలికంగా షెడ్‌ ఏర్పాటు చేయాలని వార్డు కౌన్సిలర్‌ చిన్నను ఆదేశించారు. కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్మన్‌ ఆనంద్‌ కుమార్‌గౌడ్‌, వైస్‌ చైర్మన్‌ షబ్బీర్‌అహ్మద్‌, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు ఎన్‌పీ వెంకటేష్‌, ఎస్సీ సెల్‌ జిల్లా చైర్మన్‌ సాయిబాబా, సీజే బెనహర్‌, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్‌ఖాద్రి, కౌన్సిలర్‌ చిన్న, లక్ష్మణ్‌యాదవ్‌, అజ్మత్‌అలీ, జగదీష్‌, వెంకటలక్ష్మి, అబ్దుల్‌హక్‌, రాజుగౌడ్‌, సుధాకర్‌గౌడ్‌ పాల్గొన్నారు.

బహుజనుల అభ్యున్నతికి సర్దార్‌ సర్వాయి పాపన్న కృషి : ఎమ్మెల్యే

మహబూబ్‌నగర్‌ : బహుజనుల అభ్యున్నతి కోసం సర్దార్‌ సర్వాయి పాపన్నగౌడ్‌ ఎన్నో పోరాటాలు చేశారని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. పీడిత వర్గాల పక్షాన నిలబడుతూ గోల్కొండ కోటను జయించిన వీరుడని కొనియాడారు. మంగళవారం ఆయన వర్దంతిని పురస్కరించుకొ ని పట్టణంలోని ఆయన విగ్రహానికి మునిసిపల్‌ చైర్మన్‌, ఉమ్మడి పాలమూరు గౌడ సంఘం అధ్యక్షుడు ఆనంద్‌కుమార్‌గౌడ్‌తో కలిసి పూలమాలలు వేసి నివాళ్ళర్పించారు. సర్వాయి పాపన్న విగ్రహాన్ని హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు వెంకటస్వామిగౌడ్‌, సాయిలుగౌడ్‌, యాదగిరిగౌడ్‌, రాజుగౌడ్‌, పురుషోత్తంగౌడ్‌, జీఎల్‌గౌడ్‌, శ్రీనివాస్‌గౌడ్‌, కుమార్‌గౌడ్‌, రమేశ్‌గౌడ్‌, వెంకటేశ్‌గౌడ్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 02 , 2024 | 11:11 PM