Share News

కురుమ యాదవులను ఆదుకుంటాం

ABN , Publish Date - Apr 03 , 2024 | 11:23 PM

అసెంబ్లీ ఎన్నికల్లో అధర్మాన్ని ఓడించటానికి ధర్మం వైపు నిలబడి కాంగ్రెస్‌ పార్టీ గెలుపుకోసం కృషిచేసిన యాదవులను ఆదుకుంటామని మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి అన్నా రు.

కురుమ యాదవులను ఆదుకుంటాం
ఐక్యత చూపుతున్న యాదవులు, కాంగ్రెస్‌ అభ్యర్థి చల్లా వంశీచంద్‌రెడ్డి, ఎమ్మెల్యే యెన్నం

- ఎమ్మెల్యే యెన్నం, ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్‌రెడ్డి

- కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో యాదవుల ఆత్మీయ సమ్మేళనం

పాలమూరు, ఏప్రిల్‌ 3 : అసెంబ్లీ ఎన్నికల్లో అధర్మాన్ని ఓడించటానికి ధర్మం వైపు నిలబడి కాంగ్రెస్‌ పార్టీ గెలుపుకోసం కృషిచేసిన యాదవులను ఆదుకుంటామని మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి అన్నా రు. బుధవారం జిల్లా కేంద్రంలోని రైస్‌మిల్లర్స్‌ అసోసియేషన్‌ బిల్డింగ్‌లో కాంగ్రెస్‌ పార్టీ పట్టణ అధ్యక్షుడు లక్ష్మణ్‌యాదవ్‌ అధ్యక్షతన ఏర్పాటు చేసిన యాదవుల ఆత్మీయ సమ్మేళనంలో ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్‌ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. గత ప్రభుత్వం యాదవుల కోసం ఆలోచించలేదు, కేవలం యాదవుల ఓట్లకోసం ఆలోచించి మనలను ఆగం చేసిందని ఎమ్మెల్యే మండిపడ్డారు. గతంలో గొర్రెలకోసం కట్టిన డీడీలను ముఖ్యమంత్రి ఒప్పించి మీకు ఇప్పించే ప్రయత్నం చేశాం, మరొక రెండు రోజుల్లో మీ డబ్బు మీ ఖాతాల్లో పడుతుందని ఎమ్మెల్యే గుర్తుచేశారు. కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్‌రెడ్డికి ఓటు వేసి గెలిపించా లని కోరారు. కార్యక్రమంలో సీడబ్ల్యుసీ ప్రత్యేక అహ్వానితులు చల్లా వంశీచంద్‌రెడ్డి, మునిసిపల్‌ చైర్మన్‌ ఆనంద్‌కుమార్‌గౌడ్‌, డీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఎస్‌.వినోద్‌కుమార్‌, సీనియర్‌ నాయకులు ఎన్‌.పి వెంకటేష్‌, మారేపల్లి సురేందర్‌రెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్‌ఖాద్రి, కృష్ణయ్య, రమేష్‌, శ్రీనివాస్‌, గోవిందు, యాదయ్య, వెంకటేష్‌, బాలమణి, పాపారాయుడులు పాల్గొన్నారు.

కష్టపడి పని చేయండి

మిడ్జిల్‌(మహబూబ్‌నగర్‌), ఏప్రిల్‌ 3 : పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలందరూ కష్టపడి పనిచేసి గెలిపించాలని ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్‌రెడ్డి, ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్‌రెడ్డిలు అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు, పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన్‌ అల్వాల్‌రెడ్డి గృహంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడారు. ఎంపీ గెలుపుతోనే జిల్లాతో పాటు జడ్చర్ల నియోజకవర్గం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఆ దిశగా కార్యకర్తలందరూ రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి నియోజక వర్గంలో భారీ మెజార్టీని తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు అల్వాల్‌రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ జిల్లా నాయకులు బరిగెల వెంకటయ్య, ఎంపీటీసీలు గౌస్‌, రాజారెడ్డి, నర్సింహ, నాయకులు బండారి కృష్ణయ్యగౌడ్‌, మల్లికార్జున్‌రెడ్డి, సాయులు, జంగయ్య, షేక్‌ ఉస్మాన్‌, కృష్ణయాదవ్‌, ఏదుల శివ, పర్వతాలు, సంపత్‌కుమార్‌, శ్రీధర్‌రా వు, రవీందర్‌రెడ్డి, పసుల శివ, మల్లేష్‌, పాండు, డోలు శ్రీను, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

ఒకరినొకరు గౌరవించుకోవాలి

- ఇఫ్తార్‌ విందులో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి

మహబూబ్‌నగర్‌, ఏప్రిల్‌ 24 : ఒకరిమతాలను మరొకరు గౌరవించుకు నే మంచి సంస్కృతి, సంప్రదాయం మహబూబ్‌నగర్‌లో ఉన్నదని, అంద రూ ఐక్యంగా ఉన్నప్పుడే అభివృద్ధి ఫలాలు అందరికీ అందుతాయన్నారు. రంజాన్‌ మాసంలో భాగంగా బుధవారం మునిసిపల్‌ చైర్మన్‌ ఆనంద్‌కుమార్‌గౌడ్‌ నివాసంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌విందులో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అందరం కలిసిమెలిసి సోదరభావంతో జీవిద్దామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సిరాజ్‌ఖాద్రి, లక్ష్మణ్‌యాదవ్‌, అశ్వక్‌, జమీల్‌, మహ్మద్‌రజాక్‌, జహీర్‌, నయీం, ఖాజామైనోద్దీన్‌ పాల్గొన్నారు.

ఫ షాషాబ్‌గుట్టలో : రంజాన్‌ మాసం సందర్భంగా షాషాబ్‌గుట్ట మసీదులో అబ్దుల్‌ రజాక్‌ ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌ విందులో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వినోద్‌కుమార్‌ పాల్గొన్నారు. అదేవిధంగా మసీదు కమిటీ చైర్మన్‌ హనీఫ్‌, శాలిమార్‌ జమాలుద్దీన్‌, అజద్‌, అవేజ్‌, మక్సూద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 03 , 2024 | 11:23 PM