కొమరయ్య స్ఫూర్తితో సమస్యలపై ఉద్యమించాలి
ABN , Publish Date - Jul 05 , 2024 | 12:19 AM
దొడ్డి కొమరయ్య స్ఫూర్తితో ప్రజాసమస్యలు పరిష్కరించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉద్యమించాలని సీపీఎం, సీపీఐ జిల్లా కార్యదర్శులు ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, నెల్లికంటి స త్యం అన్నారు.

కొమరయ్య స్ఫూర్తితో సమస్యలపై ఉద్యమించాలి
నల్లగొండ రూరల్, నార్కట్‌పల్లి, నకిరేకల్, జూలై 4: దొడ్డి కొమరయ్య స్ఫూర్తితో ప్రజాసమస్యలు పరిష్కరించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉద్యమించాలని సీపీఎం, సీపీఐ జిల్లా కార్యదర్శులు ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, నెల్లికంటి స త్యం అన్నారు. దొడ్డి కొమరయ్య వర్ధతి సందర్భంగా గురువారం పట్టణంలోని పా ర్టీ జిల్లా కార్యాలయాల్లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా ని వాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాటి వీరతెలంగాణ స్ఫూర్తితో సమస్యలు లేని తెలంగాణ కోసం ఐక్యంగా ప్రజలు ఉద్యమించాలని పి లుపునిచ్చారు. కేంద్రప్రభుత్వం విభజన చట్టంలోని అంశాలను పరిష్కరించకుం డా కాలయాపన చేస్తుందని ఆరోపించారు. కేంద్రప్రభుత్వం రాషా్ట్రల హక్కులు, విధులు, నిధులను కుదిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. జరగబోయే బడ్జెట్ సమావేశాల్లో నల్లగొండ జిల్లా సాగు, తాగునీటి ప్రాజెక్టుల పూర్తికి ప్రభుత్వం త గిన నిధులు కేటాయించాలని కోరారు. ప్రభుత్వం అన్ని రకాల పింఛన్లను పెంచి అందజేయాలని అన్నారు. ధరణిలో నెలకొన్న అనేక భూ సమస్యల పరిష్కారాని కి కాలపరిమితి నిర్ణయించి పర్యవేక్షణ చేయాలన్నారు. కొమరయ్య అమరుడైన రోజును రైతురక్షణ దినంగా ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సీసీఎం నాయకులు తుమ్మల వీరారెడ్డి, బండా శ్రీశైలం, పాలడుగు నాగార్జున, సయ్యద్ హాషం, పి.నర్సిరెడ్డి, వి.నారాయణరెడ్డి, దండెంపల్లి సత్తయ్య, తుమ్మల పద్మ, వెంకటరమణారెడ్డి, అనంతుల శంకరయ్య, సీపీఐ నాయకులు దేవేందర్‌రెడ్డి, వీరస్వామి, నరసింహ, లెనిన, యూసుఫ్ పాల్గొన్నారు.
నార్కట్‌పల్లి మండల కేంద్రంలోని నర్రా రాఘవరెడ్డి భవనలో దొడ్డి కొమురయ్య వర్ధంతిని నిర్వహించారు. కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి చెరు కు పెద్దులు, నాయకులు కల్లూరి యాదగిరి, చింతపల్లి బయ్యన్న, అర్థం శ్రీనివా స్, ఆమనగంటి ఐలయ్య, దండు రవి తదితరులు పాల్గొన్నారు.
నకిరేకల్‌లోని నర్రా రాఘవరెడ్డి భవనలో సీపీఎం ఆధ్వర్యంలో కొమరయ్య వర్ధంతిని నిర్వహించారు. కార్యక్రమంలో సీపీఎం మండల, పట్టణ అధ్యక్షులు రా చకొండ వెంకట్‌గౌడ్, వంటెపాక కృష్ణ, సాకుంట్ల నర్సింహ, ఆదిమళ్ల శ్రీను, జమదగ్ని తదితరులు పాల్గొన్నారు.