ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్లాలి
ABN , Publish Date - Nov 28 , 2024 | 11:33 PM
జిల్లాలోని అన్ని గ్రామాల్లోని ఉపాధి పనుల కు సంబంధించి ప్రత్యేక కార్యా చరణతో సిబ్బంది ముందుకెళ్లాలని డీఆర్‌డీవో ఓబులేష్ అన్నారు.

- ఉపాధి హామీ పనులపై డీఆర్‌డీవో ఓబులేష్
తాడూరు/ వంగూరు, నవంబ రు 28 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలోని అన్ని గ్రామాల్లోని ఉపాధి పనుల కు సంబంధించి ప్రత్యేక కార్యా చరణతో సిబ్బంది ముందుకెళ్లాలని డీఆర్‌డీవో ఓబులేష్ అన్నారు. గు రువారం మండలంలోని గుంతకో డూరు, మేడిపూర్, ఆకునెల్లికుదు రు గ్రామాల్లో నర్సరీలను, ఉపాధి పనుల కా ర్యాచరణను పరిశీలించారు. ఆయన మాట్లాడు తూ గ్రామాల్లో ఉన్న ప్రతీ నర్సరీల్లో బ్యాగ్ ఫి ల్లింగ్ పూర్తి చేసుకుని విత్తనాలు వేయాలని సూచించారు. కార్యక్రమంలో ఏపీవో చంద్ర సిద్దార్థ, సీటీఏ రాజేష్‌కుమార్, యా గ్రామా లఎఫ్‌ఏలు, నర్సరీ నిర్వాహకులు పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి
వంగూరు : వానాకాలం ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని డీఆర్‌డీవో ఓబులేష్ అన్నారు. మండలంలో కొండారెడ్డిపల్లిలో ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం ఆయన పరిశీలించారు. ఏగ్రేడ్ ధాన్యం క్వింటాలుకు రూ.2,320, బి గ్రేడ్ ధాన్యానికి రూ.2,300 ప్రభుత్వం చెల్లిస్తుం దన్నారు. సన్నాలకు రూ.500 బోనస్ వర్తిస్తుం దన్నారు. కార్యక్రమంలో ప్రత్యేక అధి కారి జివి, రమేష్, ఏపీఎం చంద్రయ్య, పాల్గొన్నారు.