Kumaram Bheem Asifabad- జల శోకం
ABN , Publish Date - Apr 03 , 2024 | 10:34 PM
ఈ ఏడాది వేసవి ప్రారంభం నుంచే ఎండల తీవ్రత అధికంగా ఉంది. దీంతో జిల్లాలోని చెరువులు, కుంటల్లో నీరు అడుగంటి పోతోంది. మరోవైపు భూగర్భ జలమట్టం సైతం పడిపోతోంది. యాసంగిలో వేసిన పంటలు సైతం సాగునీరు లేక ఎండిపోతున్నాయి. రాబోయే రోజుల్లో తాగునీటి సమస్య తీవ్రరూపం దాల్చనుందని ప్రజలు ఆందోళన చెందు తున్నారు.

- మార్చి నెలలోనే భారీగా తగ్గిన నీటి మట్టం
- జిల్లాలో ముంచుకొస్తున్న తాగునీటి ఎద్దడి
ఈ ఏడాది వేసవి ప్రారంభం నుంచే ఎండల తీవ్రత అధికంగా ఉంది. దీంతో జిల్లాలోని చెరువులు, కుంటల్లో నీరు అడుగంటి పోతోంది. మరోవైపు భూగర్భ జలమట్టం సైతం పడిపోతోంది. యాసంగిలో వేసిన పంటలు సైతం సాగునీరు లేక ఎండిపోతున్నాయి. రాబోయే రోజుల్లో తాగునీటి సమస్య తీవ్రరూపం దాల్చనుందని ప్రజలు ఆందోళన చెందు తున్నారు.
ఆసిఫాబాద్, ఏప్రిల్ 3: జిల్లాలో రోజురోజుకు భూగర్భ జల మట్టాలు అడుగం టుతున్నాయి. దీంతో అటు రైతులు ఇటు సామాన్య ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఒక పక్క నీరందక పంటలు ఎండుతుంటే మరొపక్క గుక్కెడు తాగునీటి కోసం జనం అగచాట్లు పడుతున్నారు. జిల్లాలో గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది గణ నీయంగా భూగర్భ జలాలు అడుగంటాయి. ఎండలు ఉగ్రరూపం దాల్చుతుం డడం 40 నుంచి 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో భూగర్భ జలాలు అఽధ: పాతా ళానికి పడిపోతున్నాయి. జిల్లాలో జనవరి నుంచి ఇప్పటి వరకు 1.27 మీటర్ల లోతుకు నీటి మట్టం తగ్గింది.
- మార్చి నెల నుంచే..
గతేడాది సమృద్ధిగా వర్షాలు కురువలేదు. ఈసారి మార్చి నెల ఆరం భం నుంచే ఎండలు మండిపోతున్నాయి. దీంతో జిల్లాలో ఎక్కడికక్కడ భూగర్భ జల మట్టం వేగంగా పడిపోయింది. ఎండ వేడిమి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగే కొద్ది నీటి మట్టం అడుగంటుతోంది. ఏజెన్సీ గ్రామాల్లో బావులు, బోర్లలో నీరు ఇంకి పోతున్నాయి. జిల్లాలో గడిచిన 20 రోజుల నుంచి ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగి పోయాయి. జిల్లాలో నిత్యం 40 నుంచి 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వాతావరణశాఖ జిల్లాను అరెంజ్ అలర్ట్ జోన్‌గా ప్రకటించింది. ఏప్రిల్ చివరి వారం, మే మాసంలో మరింత ఎండలు మండిపోయే అవకాశాలు ఉన్నాయని వాతావరణశాఖ హెచ్చరించింది. దీనికి తోడు జిల్లాలోని వాగులు, ఒర్రెలనుంచి యథేచ్ఛగా ఇసుకను తోడేస్తుండడంతో ఏటా భూగర్భ జలాలు అడుగంటి పోయి ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. రోజురోజుకు పడిపోతున్న భూగర్భ జలాలలో అటు రైతులు, ఇటు సామాన్య ప్రజలు తాగు, సాగునీటి కోసం అవస్థలు పడాల్సి వస్తోంది. ఏజెన్సీ మండలాల్లో కొన్నిచోట్ల ఇప్పటికే నీటి కటకట ఏర్పడింది. రాబోయే రోజుల్లో జిల్లాలో తాగునీటి ఎద్దడి ఏర్పడే ప్రమాదం పొంచి ఉంది.
- పడిపోతున్న నీటి మట్టం..
జిల్లాలో రోజురోజుకు నీటి మట్టం పడిపోతోంది. ఏజెన్సీ మండలా ల్లోని కొన్ని ప్రాంతాలలో బోర్లు, బావుల్లో నీరు అడుగంటుతోంది. జి ల్లాలో భూగర్భ జలాలను అంచనా వేసేందుకు అధికారులు 15 ప్రాం తాల్లో ఫీజో మీటర్లను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా భూగర్భ జ లాలు, నీటి మట్టాలు పరిశీలిస్తారు. జనవరిలో జిల్లా సరాసరి నీటి మట్టం 7.11 మీటర్లుగా ఉంది. ఫిబ్రవరిలో 7.64 మీటర్లకు, మార్చిలో 8.38 మీటర్లకు నీటి మట్టం పడిపోయింది. జనవరి నుంచి మార్చి వర కు గమనిస్తే జిల్లాలో 1.27 మీటర్లలోతుకు నీటి మట్టం తగ్గిపోయింది. ఎండలు మ రింత ముదిరితే నీటి మట్టం మరింత పడిపోనుందని చెబుతున్నారు.
- సాగునీటికి అవస్థలు..
జిల్లాలోని ఆయా మండలాల్లోని బావులు, చెరువులు, చిన్నచిన్న కుం టలు ఎండిపోతున్నాయి. యాసంగి సీజన్‌లో చెరువులు, కుంటలపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్న రైతులకు ఇబ్బందులు తప్పడంలేదు. చెరువుల కింద జిల్లాలో యాసంగి సీజన్‌లో 20వేల ఎకరాల వరి సాగు చేశారు. కొన్ని చోట్ల వరి పంట పొట్ట దశకు రాగ నీరందక పంట ఎండి పోయే పరిస్థితులు కనిపిస్తు న్నాయి. ఏజెన్సీ గ్రామాల్లో బావులు, బోర్లలో నీరు అడుగంటడంతో ఏజెన్సీ ప్రాంతవాసులు సమీప వాగులు, ఒర్రెల నుంచి తాగునీరు తెచ్చుకుంటూ ఇబ్బందులు పడుతు న్నారు.
పంటలు ఎండిపోతున్నాయి..
- సోమశేఖర్, రైతు, పేకలగుండం, దహెగాం
ఆయకట్టు ద్వారా సాగునీరందక పంటలు ఎండిపోతున్నాయి. ఎకరం భూమిలో వరిపంట సాగు చేశాను. ప్రాజెక్టులో నీరు అడుగంటడంతో చివరి పంట వరకు నీరు రావడంలేదు. దీంతో పంటలు పొట్ట దశలో ఎండిపోతున్నాయి. ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి.