Share News

అటవీ జంతువుల కోసం నీటి సరఫరా

ABN , Publish Date - Feb 28 , 2024 | 12:03 AM

దేవరకొండ అటవీశాఖ రేంజ్‌ పరిధిలో అటవీ జంతువులు, వన్యప్రాణులకు వేసవి దాహార్తి తీర్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు దేవరకొండ రేంజ్‌ అటవీశాఖ అధికారి సాయిప్రకాష్‌ తెలిపారు.

అటవీ జంతువుల కోసం  నీటి సరఫరా

అటవీ జంతువుల కోసం నీటి తొట్లకు నీటి సరఫరా

దేవరకొండ, ఫిబ్రవరి 27: దేవరకొండ అటవీశాఖ రేంజ్‌ పరిధిలో అటవీ జంతువులు, వన్యప్రాణులకు వేసవి దాహార్తి తీర్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు దేవరకొండ రేంజ్‌ అటవీశాఖ అధికారి సాయిప్రకాష్‌ తెలిపారు. దేవరకొండలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అటవీశాఖ దేవరకొండ రేంజ్‌ పరిధిలో 6 బోర్లు వేసి 40కి పైగా నీటితొట్ల ను ఏర్పాటు చేసి సోలార్‌ బోర్ల ద్వారా నీటిని నింపుతున్నట్లు ఆయన తెలిపారు. పది కుంటలు, చెక్‌డ్యాంలకు, నీటి తొట్లకు పైప్‌లైన్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నామన్నారు. అగ్ని ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపడుతున్నామన్నారు. సోలార్‌, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిఘా పెంచామని, పశువుల కాపర్లు అడవిలో సంచరించవద్దన్నారు. వేసవి దృష్ట్యా అడవిలో అనుమతి లేకుండా సంచరించవద్దని ఆయన హెచ్చరించారు.

Updated Date - Feb 28 , 2024 | 12:03 AM