నేడు సాగర్ కుడికాల్వకు నీటి విడుదల
ABN , Publish Date - Mar 01 , 2024 | 04:04 AM
తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్ జలాశయం నుంచి కుడికాల్వకు 3 టీఎంసీల నీటిని విడుదల చేయాలని కృష్ణా నదీ
నాగార్జునసాగర్, హైదరాబాద్, ఫిబ్రవరి 29(ఆంధ్రజ్యోతి): తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్ జలాశయం నుంచి కుడికాల్వకు 3 టీఎంసీల నీటిని విడుదల చేయాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ) నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం నుంచి నీటిని విడుదల చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ పరిధిలోని గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల ప్రజల తాగునీటి అవసరాల కోసం నీటిని విడుదల చేయాలని ఏపీ నీటిపారుదల శాఖ అధికారులు కేఆర్‌ఎంబీకి రెండు రోజుల క్రితం లేఖలు రాశారు. దాంతో శుక్రవారం నుంచి వారం రోజుల పాటు రోజుకు సుమారు 5 వేల క్యూసెక్కుల చొప్పున మొత్తం 3 టీఎంసీల నీటిని విడుదల చేయనున్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు.