Share News

డిండి నుంచి నానఆయకట్టుకు నీటి విడుదల

ABN , Publish Date - Apr 18 , 2024 | 12:39 AM

డిండి ప్రాజెక్టు నుంచి చందంపేట, నేరేడుగొమ్ము మం డలాలకు నీటి విడుదలను అధికారులు బుధవారం పోలీసుల రక్షణలో పునరుద్ధరించారు.

 డిండి నుంచి నానఆయకట్టుకు నీటి విడుదల
డిండి ప్రాజెక్టు నుంచి విడుదలవుతున్న నీరు

డిండి నుంచి నానఆయకట్టుకు నీటి విడుదల

భూగర్భ జలాల వృద్ధికి అవకాశం

దేవరకొండ/ డిండి, ఏప్రిల్‌ 17: డిండి ప్రాజెక్టు నుంచి చందంపేట, నేరేడుగొమ్ము మం డలాలకు నీటి విడుదలను అధికారులు బుధవారం పోలీసుల రక్షణలో పునరుద్ధరించారు. ఉన్నతాధికారుల ఆదేశం మేరకు 200 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసినట్లు ఏఈ ఫయాజ్‌ తెలిపారు. డిండి ప్రాజెక్టు నీటిని నానఆయకట్టు అయిన చందంపేట, నేరేడుగొమ్ము మండలాలకు విడుదల చేయవద్దని డిండి మండల కేంద్రంలోని ఈఈ కార్యాలయం ఎదుట రైతులు మంగళవారం ఆందోళన చేశారు. దీంతో డీఈ శ్రీనివాస్‌ నీటి విడుదలను నిలిపివేశారు. ఉన్నతాధికారుల ఆదేశం మేరకు నీటి విడుదలను పునరుద్ధరించినట్లు సంబంధితశాఖ అధికారులు తెలిపారు.

రెండు మండలాల్లో భూగర్భజలాల వృద్ధి

డిండి ప్రాజెక్టు నీటి విడుదలతో నాన ఆయకట్టు అయిన చందంపేట, నేరేడుగొమ్ము మండలాల్లోని 20చెరువులు, కుంటలకు కాలువల ద్వారా నీరు అందుతుంది. చం దంపేట, నేరేడుగొమ్ము మండలాల చెరువులు నింపేందుకు ఈ నెల 15న డిండి ప్రాజెక్టు నీటిని విడుద ల చేశారు. నీటి విడుదలతో చెరువు లు, కుంటలు నిండటం ద్వారా బో రు, బావుల వద్ద భూగర్భ జలాలు పెరుగుతాయని దీంతో పా టు పశువులు, జీవరాశులకు తాగునీరు అందుతుందని చందంపేట, నేరేడుగొమ్ము మండలాల రైతులు ఆశాభావం వ్యక్తం చే స్తున్నారు. చందంపేట, నేరేడుగొమ్ము మండలంలో ఈ సంవత్సరం వర్షాలు కురవకపోవడంతో భూగర్భజలాలు అడుగంటి, చెరువులు, కుంటలు వట్టిపోయాయి. డిండి ప్రాజెక్టు ద్వారా కా ల్వలకు నీటిని విడుదల చేస్తే బోరు, బావుల్లో నీరు పెరుగుతుందని చెబుతున్నారు. డిండి ప్రాజెక్టు నుంచి నీటి విడుదల ద్వారా చందంపేట, నేరేడుగొమ్ము మండలాలకు మేలు చేకూరనుంది.

Updated Date - Apr 18 , 2024 | 12:39 AM