పరి‘శ్రమ’ వృథా!
ABN , Publish Date - Oct 25 , 2024 | 12:20 AM
దేశాభివృద్ధికి పరిశ్రమలు పట్టుగొమ్మలు. వాటి స్థాపన తోనే ఆర్థిక పురోగతి సాధ్యమని ప్రభుత్వాలు చెబు తుంటాయి. అందుకు ఔత్సాహికులకు ప్రోత్సహ కాలు అందిస్తు న్నామని చెప్పుకుంటాయి. తద్వారా నిరుద్యోగ సమస్యలను రూపుమాపేందుకు కృషి చేస్తున్నామని అంటుంటాయి.

పారిశ్రామిక అభివృద్ధికి విఘాతం
ఔత్సాహికులకు అందని ప్రోత్సాహం
ఏళ్లతరబడి సబ్సిడీల కోసం ఎదురుచూపులు
ప్రభుత్వాల నిర్లక్ష్యం..నిరుద్యోగులకు శాపం
నిరాశ నిష్పృహల్లో భూపాలపల్లి జిల్లా యువత
భూపాలపల్లిటౌన్, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): దేశాభివృద్ధికి పరిశ్రమలు పట్టుగొమ్మలు. వాటి స్థాపన తోనే ఆర్థిక పురోగతి సాధ్యమని ప్రభుత్వాలు చెబు తుంటాయి. అందుకు ఔత్సాహికులకు ప్రోత్సహ కాలు అందిస్తు న్నామని చెప్పుకుంటాయి. తద్వారా నిరుద్యోగ సమస్యలను రూపుమాపేందుకు కృషి చేస్తున్నామని అంటుంటాయి. అయితే.. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థ తి అందుకు భిన్నంగా ఉంది. పరిశ్రమల స్థాపనకు ప్రోత్సహకాలు ఆచరణలో కానరావడం లేదు. రాయతీ లు రాక ఔత్సాహికులకు నిరాశ, నిష్పృహలకు గురవుతున్నారు. ఏళ్ల తరబడి ఇదే పరిస్థితి.
పెండింగ్‌లో దరఖాస్తులు
పునర్విభజనలో భాగంగా కొత్తగా ఏర్పడిన భూపాలపల్లి జిల్లాలో నాలుగేళ్లుగా స్వయం ఉపాధికోసం దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగులు సబ్సిడీలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పరిశ్రమల స్థాపనకు ఈ నాలుగేళ్లకాలంలో ఔత్సాహికులకు సంబంధిత శాఖకు 300 మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో 216 మందికి సబ్సిడీలు పెండింగ్‌లోనే ఉన్నాయి. దీంతో పాత వారిని చూసి కొత్తవారెవరూ పరిశ్రమల శాఖ నుంచి లబ్ధిపొందేందుకు ఆసక్తి చూపడం లేదు.
- పరిశ్రమలు.. రాయితీలు
పరిశ్రమల స్థాపనకు ఔత్సాహికులకు ప్రభుత్వం రాయితీలతో రుణాలు మంజూరు చేస్తుంది. ఒక్కో యూనిట్‌కు రూ. 50 వేల నుంచి రూ. 3 కోట్ల లబ్ధి పొందే అవకాశం ఉంది. ఇందులో ఎస్సీ, ఎస్టీలు, మహిళలకు 45 శాతం, మిగతా వారికి 25 శాతం సబ్సిడీ ఉంటుంది. ఈ రుణాలతో చిన్న, పెద్ద తరహా పరిశ్రమల స్థాపనే కాకుండా వాహనాలు కొనుగో లు చేసి నిర్వహించుకొనే అవకాశం ఉంది. రైస్‌మి ల్లులు, విత్తన శుద్ధికేంద్రా లు, పాల ఉత్పత్తి కేంద్రా లు, జిన్నింగ్ మిల్లులు, ఇటుకల తయారీ కేంద్రాలు, పిండి గిర్నీలు, విస్తారాకుల తయారీ కేంద్రాలు తదితర పరిశ్రమలు స్థాపించుకోవచ్చు. ఇల్లాలో ఈ తరహా పరిశ్రమలు సుమారు 450 ఉన్నాయి. ఇంకా కొత్తగా 300 పైచిలుకు దరఖాస్తులు నాలుగేళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయి. సబ్సిడీల జారీలో అలసత్వం వహించడం వల్ల పరిశ్రమల స్థాపనకు ఆటంకాలు ఏర్పడుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
- 2021 నుంచి తప్పని ఎదురుచూపులు
పరిశ్రమల శాఖ నుంచి సబ్సిడీలు పొందడానికి ప్రతి ఏడాది వందల సంఖ్యలో నిరుద్యోగులు దరఖాస్తు చేసుకుంటారు. కానీ అధికారులు మాత్రం అందులో కొన్నింటిని మాత్రమే స్వీకరిస్తారు. సబ్సిడీ రుణం మంజూరైనప్పటికీ ఏళ్ల తరబడి వేచిచూడాల్సి వస్తోందని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2021ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు రుణాలు పొందిన 122 మంది ఎస్టీలు, 94 మంది ఎస్సీలకు, ఇద్దరు జనరల్ నిరుద్యోగులకు సుమారు రూ. 17.50కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో లబ్ధిదారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
ప్రభుత్వానికి నివేదించాం..
- సిద్ధార్థ్, పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్, భూపాలపల్లి
పరిశ్రమల స్థాపనకు యువతను ప్రోత్సహిస్తూనే ఉన్నాం. రుణాలు మంజూరైన వారికి సబ్సిడీ రావడం ఆలస్యమవుతున్నది వాస్తవమే. ఈ విషయాన్ని కలెక్టర్ల ద్వారా ప్రభుత్వానికి నివేదిస్తున్నాం. మంజూరు కావడంతోనే లబ్ధిదారులకు సమాచారం అందిస్తాం.