Share News

కూలి డబ్బులు ఇవ్వాలి

ABN , Publish Date - Mar 22 , 2024 | 11:32 PM

ఏడు వారాల నుంచి కూలి డబ్బులు రావడం లేదని, వెంటనే ఇవ్వాలని శుక్రవారంమండల పరిధిలోని జక్లపల్లి, లింగాయిపల్లి గ్రామాల ఉపాధి హామీ కూలీలు పని ప్రాంతంలో నిరసన చేపట్టారు.

కూలి డబ్బులు ఇవ్వాలి
గండీడ్‌ : జక్లపల్లిలో కూలీలను సముదాయిస్తున్న ఏపీవో హరిచంద్రుడు

- పనిచేసే చోట ఉపాధి హామీ కూలీల నిరసన

గండీడ్‌, మార్చి 22 : ఏడు వారాల నుంచి కూలి డబ్బులు రావడం లేదని, వెంటనే ఇవ్వాలని శుక్రవారంమండల పరిధిలోని జక్లపల్లి, లింగాయిపల్లి గ్రామాల ఉపాధి హామీ కూలీలు పని ప్రాంతంలో నిరసన చేపట్టారు. జక్లపల్లి 65 మంది కూలీలు, లింగాయిపల్లిలో 45 మంది కూలీలు ప్రధాన రోడ్డుపై నిరసన చేశారు. 15 రోజులకు ఒకసారి డబ్బులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు ఏపీవో హరిచంద్రుడు అక్కడికి చేరుకొని కూలీలను సముదాయించి తప్పకుండా కూలి డబ్బులు వచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమం లో ఎఫ్‌ఏలు, ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.

జడ్చర్లలో...

జడ్చర్ల : ఉపాధి కూలీలకు వెంటనే కూలీ డబ్బులు చెల్లించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు జగన్‌ శుక్రవారం డిమాండ్‌ చేశారు. గడిచిన వారం రోజులుగా జడ్చర్ల మండలంలోని పలు గ్రామాలలో ఉపాధి పనులు జరుగుతున్న ప్రాంతాలను సందర్శించడం జరిగిందని, ఎక్కడా కనీస సౌకర్యాలు, వసతులు కల్పించలేదని ఆరోపించారు. ఉపాధి కూలీలకు కొలతల విధానాన్ని రద్దు చేసి, దినసరి కూలీ రూ.800 చెల్లించాలని కోరారు. నెలరోజులుగా పనిచేస్తున్న కూలీలకు కూలీ డబ్బులు చెల్లించకపోవడం దుర్మార్గమని అన్నారు. కూలీ డబ్బులు చెల్లించే అంశంతో పాటు మౌలిక సదుపాయాలు కల్పించే అంశంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మండల కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఉపాధి పనులు జరుగుతున్న ప్రాంతాలను పరిశీలించిన వారిలో యాదయ్య, పెంటయ్య, రవికిరణ్‌, వివేక్‌, వెంకటమ్మ, మణెమ్మ, జంగయ్య ఉన్నారు.

Updated Date - Mar 22 , 2024 | 11:33 PM