Share News

స్ర్టాంగ్‌ రూమ్‌లో భద్ర పర్చిన వీవీ ప్యాట్‌లు

ABN , Publish Date - Jun 05 , 2024 | 11:34 PM

పార్లమెంట్‌ ఎన్నికల అనంతరం జిల్లాలో నాలుగు నియోజకవర్గాలకు సంబంధించి వీవీ ప్యాట్‌లను స్థానిక తహసీల్దారు కార్యాలయం స్ర్టాంగ్‌ రూమ్‌ నందు భద్ర పర్చడం జరిగిందని జిల్లా కలెక్టర్‌ సి. నారాయణరెడ్డి అన్నారు.

స్ర్టాంగ్‌ రూమ్‌లో భద్ర పర్చిన వీవీ ప్యాట్‌లు
స్ర్టాంగ్‌ రూమ్‌లో వీవీ ప్యాట్‌లు భద్ర పరుస్తున్న అధికారులు

వికారాబాద్‌, జూన్‌ 5 : పార్లమెంట్‌ ఎన్నికల అనంతరం జిల్లాలో నాలుగు నియోజకవర్గాలకు సంబంధించి వీవీ ప్యాట్‌లను స్థానిక తహసీల్దారు కార్యాలయం స్ర్టాంగ్‌ రూమ్‌ నందు భద్ర పర్చడం జరిగిందని జిల్లా కలెక్టర్‌ సి. నారాయణరెడ్డి అన్నారు. బుధవారం ఎస్పీ కోటిరెడ్డి తో కలిసి ఈవీఎంలను భద్ర పర్చిన ఏఎంసీ గోడౌన్‌, తహసీల్దార్‌ కార్యాలయ స్ర్టాంగ్‌ రూమ్లను పరిశీలించారు. ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు పార్లమెంట్‌ ఎనన్నికల కౌంటింగ్‌ పూర్తి అయిన సందర్భగా వికారాబాద్‌, కొడంగల్‌, పరిగి, తాండూరు నియోజకవర్గాలకు సంబంధించి ఎనన్నికల నిర్వహణకు ఉపయోగించిన ఈవీఎంలు, కంట్రోల్‌ యూనిట్లు, బ్యాలెట్‌ యూనిట్లను ఏఎంసీ గోడౌన్‌ నందు భద్రపర్చడం జరిగిందన్నారు. సంబంధిత రిజిస్ట్రర్‌లలో సంతకాలు చేశారు. నిరంతరం సీసీ కెమేరాల పర్యవేక్షణ ఉండాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో సుధీర్‌, ఆర్‌డీవో వాసుచంద్ర, తహసీల్దార్‌ లక్ష్మీనారాయణ ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 05 , 2024 | 11:34 PM