Share News

ప్రతీ ఇంటికి ఓటర్‌ స్లిప్పులు అందజేయాలి

ABN , Publish Date - Apr 24 , 2024 | 11:39 PM

లోక్‌ సభ ఎన్నికలకు సంబంధించి ప్రతీ ఇంటికి ఓటర్‌ ఇన్ఫర్మేషన్‌ స్లిప్‌ (ఓటర్‌ స్లిప్‌) అందజేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌ ఆదేశించారు.

ప్రతీ ఇంటికి ఓటర్‌ స్లిప్పులు అందజేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవర్‌

- జిల్లా ఎన్నికల అధికారి తేజస్‌ నందలాల్‌పవార్‌

వనపర్తి రాజీవ్‌చౌరస్తా, ఏప్రిల్‌ 24: లోక్‌ సభ ఎన్నికలకు సంబంధించి ప్రతీ ఇంటికి ఓటర్‌ ఇన్ఫర్మేషన్‌ స్లిప్‌ (ఓటర్‌ స్లిప్‌) అందజేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌ ఆదేశించారు. బుధవా రం సాయంత్రం ఎన్నికల సన్నద్ధతపై రాష్ట్ర ప్రధాన ఎలక్టోరల్‌ అధికారి వికాస్‌ రాజ్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి జిల్లా ఎన్నికల అధికారులకు అవగాహన కల్పించారు. హోం ఓటింగ్‌, పోస్టల్‌ బ్యాలెట్‌ సహా పోలింగ్‌ ఏర్పాట్లు పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌ అనంతరం జిల్లా ఎన్నికల అధికారి ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఓటర్‌ స్లిప్స్‌ పంపిణీ పూర్తయిన తరువాత రిపోర్టు సమర్పించాలని సంబంధిత అధికారులు, తహసీల్దర్‌లను ఆదేశించారు. షె డ్యూల్‌ ప్రకారం ఓటర్‌ స్లిప్స్‌ పంపిణీ ప్రక్రియ పూర్తి చేయాలని , లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ రెవెన్యూ నగేష్‌, ఆర్డీవో పద్మావతి ఇతర నోడల్‌ అధికారులు , తహసీల్దార్లు, ఎన్నికల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

25 నుంచి ఓటర్‌ స్లిప్పులు పంపిణీ

ఈనెల 25 నుంచి ఇంటింటికి ఓటరు స్లిప్పులు పంపిణీ చేయనున్న ట్లు అదనపు కలెక్టర్‌ రెవెన్యూ నగేష్‌ వెల్లడించారు. బుధవారం అదన పు కలెక్టర్‌ చాంబర్‌లో రాజకీయ ప్రతినిధులతో ఓటర్‌ స్లిప్పుల పంపిణీ గు రించి సమావేశం నిర్వహించారు. ఎన్నికల్లో అందరూ నియమ , నిబంధ నలు పాటించి సహకరించాలని తెలిపారు. సమావేశంలో ఆర్‌డీవో పద్మా వతి, ఫిషరీస్‌ అధికారి ముత్యాలప్ప, బీజేపీ ప్రతినిధి ప్రవీణ్‌, బీఆర్‌ఎస్‌ ప్రతినిధి జమీల్‌, కాంగ్రెస్‌ ప్రతినిధి వేణచారి పాల్గొన్నారు.

Updated Date - Apr 24 , 2024 | 11:40 PM