Share News

Kumaram Bheem Asifabad- ఓటర్ల భద్రతే ధ్యేయం

ABN , Publish Date - Apr 02 , 2024 | 09:59 PM

జిల్లాలో ఓటర్ల భద్రత కోసమే కవాతు నిర్వహిస్తున్నామని అడిషనల్‌ ఎస్పీ ప్రభాకర్‌రావు అన్నారు. మంగళవారం మండలంలోని రౌటసంకెపల్లి, అడ్డఘట్‌ గ్రామాల్లో సీఐ సతీష్‌, సీఆర్పీఎఫ్‌ ఇన్స్‌పెక్టర్‌ బద్రిప్రసాద్‌, ఎస్సై రాజేశ్వర్‌,ప్రవీణ్‌, సీఆర్పీఎఫ్‌ బలగాలతో కవాతు నిర్వహించారు.

Kumaram Bheem Asifabad-    ఓటర్ల భద్రతే ధ్యేయం
ఎదులవాడలో కవాతు నిర్వహిస్తున్న పోలీసులు

ఆసిఫాబాద్‌ రూరల్‌, ఏప్రిల్‌ 2: జిల్లాలో ఓటర్ల భద్రత కోసమే కవాతు నిర్వహిస్తున్నామని అడిషనల్‌ ఎస్పీ ప్రభాకర్‌రావు అన్నారు. మంగళవారం మండలంలోని రౌటసంకెపల్లి, అడ్డఘట్‌ గ్రామాల్లో సీఐ సతీష్‌, సీఆర్పీఎఫ్‌ ఇన్స్‌పెక్టర్‌ బద్రిప్రసాద్‌, ఎస్సై రాజేశ్వర్‌,ప్రవీణ్‌, సీఆర్పీఎఫ్‌ బలగాలతో కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సంబంధించిన ఫిర్యాదుల కోసం టోల్‌ ఫ్రీ నంబరు 1950కు, సీ విజిల్‌ అప్లికేషన్‌లో ఫిర్యాదు చేయవచ్చన్నారు. విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, దేవాలయాలు, మజీద్‌లు, చర్చిలు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఎలాంటి ఎన్నికల ప్రచారాలు నిర్వహించొద్దని తెలిపారు. లోక్‌సభ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఎలాంటి మద్యం, డబ్బుకు, బహుమతుల ప్రలోభాలకు ఓటర్ల గురి కావద్దని కోరారు. అనంతరం ఎదులవాడ గ్రామంలో పోలీసు కవాతు నిర్వహించారు.

వాహనాలు తనిఖీ చేయాలి

వాంకిడి: పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో అంతరాష్ట్ర సరిహద్దు చెక్‌ పోస్టుల్లో పకడ్బందీగా వాహనాలను తనిఖీ చేయాలని అడిషనల్‌ ఎస్పీ ప్రభాకర్‌రావు సూచించారు. అడిషనల్‌ ఎస్పీ ప్రభాకర్‌రావు, డీఎస్సీ సదయ్యతో కలిసి వాంకిడి టోల్‌ ప్లాజా చెక్‌ పోస్టును మంగళవారం తనిఖీ చేశారు. వాహనాలను తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. తనిఖీ కేంద్రాల వద్ద చెక్‌ పోస్టు సిబ్బంది అప్రమత్తంగా ఉండి ప్రతి వాహనాన్నీ తనిఖీ చేయాల న్నారు. నగదు, మద్యం, గంజాయి, వరి ధాన్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సీఐ శ్రీనివాస్‌, సీఐ రాంబాబు, ఎస్సై సాగర్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 02 , 2024 | 09:59 PM