Manchiryāla- నిబంధనలు ఉల్లంఘన
ABN , Publish Date - Jun 12 , 2024 | 10:16 PM
జిల్లాలోని భీమారం మండలంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. అధికారులను ఖాతరు చేయకుండా, నిబంధనలకు విరుద్ధంగా వెంచర్లు ఏర్పాట్లు అక్రమంగా ప్లాట్లు విక్రయిస్తున్నారు. తమ దారికి రాని అధికారులను రాజకీ య బలం పేరుతో ఒత్తిళ్లకు గురి చేస్తూ అక్రమంగా వ్యాపారం కొనసాగిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.

202ఎంఎన్‌పీ12. అక్రమ ప్లాట్లుగా పేర్కొంటూ అధికారులు ఏర్పాటు చేసిన నోటీసు బోర్డు (ఫైల్)
నిబంధనలు ఉల్లంఘన
- అనుమతులు లేకుండానే వెంచర్ ఏర్పాటు చేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు
- నోటీసు బోర్డు తొలగించి మరీ విక్రయాలు
- ఒత్తిళ్లతో చేతులెత్తేసిన అధికారులు
మంచిర్యాల, జూన్ 12 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని భీమారం మండలంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. అధికారులను ఖాతరు చేయకుండా, నిబంధనలకు విరుద్ధంగా వెంచర్లు ఏర్పాట్లు అక్రమంగా ప్లాట్లు విక్రయిస్తున్నారు. తమ దారికి రాని అధికారులను రాజకీ య బలం పేరుతో ఒత్తిళ్లకు గురి చేస్తూ అక్రమంగా వ్యాపారం కొనసాగిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. మండల కేంద్రంతోపాటు పక్కనున్న పోలం పల్లి గ్రామంలో అక్రమ వెంచర్లు ఏర్పాటు చేసి విక్రయాలకు పాల్పడు తున్నారు. నిబంధనల ప్రకారం డీటీసీపీ (డిస్ట్రిక్ట్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్) అనుమతులు ఉంటేనే ప్లాట్లు విక్రయించడానికి వెసులుబాటు ఉంటుంది. అయితే నిబంధనలకు విరుద్దంగా రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్‌కు చెందిన పలువురు బాధ్యులే అక్రమాలకు పాల్పడుతుం డడం గమనార్హం.
ఫ ఐదెకరాల్లో వెంచర్ ఏర్పాటు..
భీమారం మండలం కేంద్రంలోని జాతీయ రహదారిని ఆనుకొని పెట్రోల్ బంక్ వెనకాల సర్వే నంబర్ 634లో ఐదు ఎకరాల్లో వెంచర్ ఏర్పాటు చేశారు. అందులో దాదాపు 70 ప్లాట్లు ఏర్పాటు చేసి, 20 ఫీట్ల రోడ్లు నిర్మించారు. డీటీసీపీ అనుమతులు లేకుండా ప్లాట్ల రిజిస్ట్రేషన్లు జరుగవనే ఉద్దేశ్యంతో వెంచర్‌లోని ఒక ఎకరానికి నాలా కన్వర్షన్ చేయించారు. దాంతో ఆ ఎకరం వ్యవసాయ భూమి వ్యవసాయేతర భూ మిగా మారింది. ఆ ఎకరాన్ని అడ్డుపెట్టుకొని మిగతా నాలుగు ఎకరాల్లో ప్లాట్లు ఏర్పాటు చేసి విక్రయాలు ప్రారంభించారు. ఎకరానికి ఉన్న నాలా కన్వర్షన్‌తో మిగతా స్థలంలోని ప్లాట్లను కూడా సబ్ రిజిస్ట్రార్ కార్యాల యంలో రిజిస్ట్రేషన్లు చేయించారు. అలా 30 వరకు ప్లాట్లను విక్రయిం చగా, వాటికి రిజిస్ట్రేషన్ కూడా చేయించినట్లు తెలుస్తోంది. భీమారం మండల కేంద్రంతోపాటు పక్కనున్న పోలంపల్లి గ్రామ శివారులోని సర్వే నెంబర్ 20లో కూడా ఇదే వ్యాపారుల బృందం 3.10 ఎకరాల్లో అక్రమ వెంచర్ ఏర్పాటు చేశారు. ఇందులో 40 ప్లాట్లు ఏర్పాటు చేశారు.
ఫ నిబంధనలు బేఖాతరు..
డీటీసీపీ అనుమతులు లేకుండా ఏర్పాటు చేసే వెంచర్ల వల్ల గ్రామ పంచాయతీ, మున్సిపా లిటీలకు స్థలం రూపంలో పెద్ద మొత్తంలో నష్టం వాటిల్లుతోంది. డీటీసీపీ అనుమతులు పొందా లంటే వెంచర్ స్థలం నుంచి 10 శాతం భూమిని పంచాయతీ పేరిట రిజిస్ట్రేషన్ చేయించాలి. ఆ భూమిని సదరు వెంచర్లలో నివాసం ఉండే ప్రజల ఉపయోగార్థం విని యోగిస్తారు. అలాగే వెంచర్ ఏర్పాటుకు నిర్ణీత రుసుం ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. అయితే అక్రమంగా వెలుస్తున్న వెంచర్ల కారణం గా అనుమతుల కోసం ఫీజు రూపేణా ప్రభుత్వ ఖజానాకు, స్థలం రూ పేణ పంచాయతీలకు నష్టం వాటిళ్లుతోంది. అయినా అధికారులు అక్రమ వెంచర్ల పట్ల చూసీ చూడనట్లు వ్యవహరించడం కొసమెరుపు.
ఫ నోటీస్ బోర్డు తొలగింపు..
పై రియల్ ఎస్టేట్ వ్యాపారుల బృందం పోలంపల్లి శివారులో అక్రమంగా వెంచర్ ఏర్పాటు చేసిన సమాచారం అందుకున్న పంచాయతీ అధికారులు అనుమతులు తీసుకోవాలని పలుమా ర్లు సూచించనప్పటికీ పెడ చెవిన పెట్టడంతోపాటు ఒత్తిళ్లకు గురి చేసే ప్రయత్నం చేయగా అక్రమ ప్లాట్లు అని, ఎవరూ కొనరాదని పేర్కొంటూ స్థలంలో నోటీసు బోర్డు ఏర్పాటు చేశారు. రెండు, మూడు రోజుల్లోనే ఆ బోర్టును తొలగిం చిన వ్యాపారులు అక్రమంగా ప్లాట్లు విక్రయిం చేందుకు యత్నిస్తున్నారు. ఇప్పటికే ఇందులో సగం వరకు ప్లాట్లు విక్రయించినట్లు సమాచారం. కాగాస్వయంగా పంచాయతీ అధికారులు ఏర్పాటు చేసిన బోర్డును తొలగించినా ఉన్నతాధికా రులు స్పందించకపోవడం వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
నోటీసులు ఇచ్చాం..
వేముల శ్రీనివాస్, భీమారం పంచాయతీ కార్యదర్శి
మండల కేంద్రంలోని ఆవడం క్రాస్ రోడ్డు వద్ద హైవేను ఆనుకొని ఉన్న సర్వే నంబరులో అక్రమంగా ప్లాట్ల వెంచర్ ఏర్పాటు చేసినట్లు తెలి సి నోటీసులు ఇచ్చాం. డీటీసీపీ అనుమతులు లేకుండానే వెంచర్ ఏర్పా టు చేశారు. దీంతో కొనుగోలుదారులు నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలో నోటీసులు ఇవ్వడంతోపాటు స్థలంలో బోర్డు కూడా ఏర్పాటు చేశాం. అయినా పట్టిం చుకోకుండా ప్లాట్లు విక్రయిస్తుండడంతో ఉన్నతాధి కారులకు తెలియజేశాం.