Share News

23న వీర హనుమాన విజయయాత్ర

ABN , Publish Date - Apr 20 , 2024 | 12:21 AM

వీర హనుమాన విజయయాత్రను విజయవంతం చేయాలని భజరంగదళ్‌ రాష్ట్ర కో-కన్వీనర్‌ కన్నెబోయిన వెంకట్‌ పిలుపునిచ్చారు.

 23న వీర హనుమాన విజయయాత్ర
ప్రచార రథాన్ని ప్రారంభిస్తున్న వెంకట్‌

23న వీర హనుమాన విజయయాత్ర

నల్లగొండ, ఏప్రిల్‌ 19: వీర హనుమాన విజయయాత్రను విజయవంతం చేయాలని భజరంగదళ్‌ రాష్ట్ర కో-కన్వీనర్‌ కన్నెబోయిన వెంకట్‌ పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని తులసీనగర్‌ ఆంజనేయస్వామి దేవాలయం ప్రచారరథాన్ని ఆ యన ప్రారంభించి మాట్లాడారు. విశ్వహిందూ పరిషత, భజరంగదళ్‌ ఆధ్వర్యంలో ఈ నెల 23వ తేదీన జరిగే వీర హనుమాన విజయయాత్రను విజయవంతం చేయాలని కోరారు. విజయయాత్రలో హిందూ బంధువులందరూ పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరారు. కార్యక్రమంలో సంఘం నాయకులు రా యలకృష్ణ, సంపతవర్మ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 20 , 2024 | 12:21 AM