శ్రీ చైతన్య విద్యాసంస్థల విజయభేరి
ABN , Publish Date - Apr 26 , 2024 | 04:54 AM
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తమ విద్యాసంస్థ సంచలన రికార్డు సృష్టించిందని శ్రీ చైతన్య విద్యాసంస్థల అకాడమిక్ డైరెక్టర్ సుష్మశ్రీ తెలిపారు. జాతీయస్థాయిలో తమ విద్యార్థి కేసీ బసవారెడ్డి మొదటి
హైదరాబాద్, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి): జేఈఈ మెయిన్ ఫలితాల్లో తమ విద్యాసంస్థ సంచలన రికార్డు సృష్టించిందని శ్రీ చైతన్య విద్యాసంస్థల అకాడమిక్ డైరెక్టర్ సుష్మశ్రీ తెలిపారు. జాతీయస్థాయిలో తమ విద్యార్థి కేసీ బసవారెడ్డి మొదటి ర్యాంకు, తోటంశెట్టి నిఖిలేశ్ 3వ ర్యాంకు, హిమాన్షు థలోర్ 6వ ర్యాంకు, రెడ్డి అనిల్ 9వ ర్యాంకు సాధించారని.. టాప్-10లో 4 ర్యాంకులను తమ విద్యార్థులే కైవసం చేసుకున్నారని ఆమె వెల్లడించారు. ఆలిండియా ఓపెన్ కేటగిరిలో 100లోపు 25 ర్యాంకులు, 200లోపు 46 ర్యాంకులు సాధించారని, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో 272 మంది తమ విద్యార్థులు 100 పర్సంటైల్ సాధించారని వివరించారు. అనితర సాధ్యమైన ప్రోగ్రాంలు, మైక్రో షెడ్యూల్స్, ఇంటర్నల్ ఎగ్జామ్స్, ర్యాంకింగ్ సిస్టం, ఇన్ఫినిటీ లెర్న్ ఆన్‌లైన్ యాప్, టాప్ ఫ్యాకల్టీ వల్లే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని వివరించారు. 2023లో జేఈఈ మెయిన్, అడ్వాన్స్‌డ్, నీట్ పోటీ పరీక్షల్లో ఓపెన్ కేటగిరిలో తమ విద్యాసంస్థ నంబర్-1 ర్యాంకులు సాధించిందని గుర్తుచేశారు. 39 సంవత్సరాల వ్యవధిలో శ్రీ చైతన్య ఆసియాలోనే అతిపెద్ద విద్యాసంస్థగా ఎదిగిందని, వివిధ రాష్ట్రాల్లో 900 శాఖలతో 9 లక్షల మంది విద్యార్థులకు సేవలను అందిస్తోందని సుష్మశ్రీ వెల్లడించారు.