Share News

రోడ్డు ప్రమాదంలో పశువైద్యాధికారి మృతి

ABN , Publish Date - Jun 04 , 2024 | 11:09 PM

జిల్లా కేంద్రంలోని రాంనగర్‌ ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పశు వైద్యాధికారి మృతి చెందారు.

 రోడ్డు ప్రమాదంలో పశువైద్యాధికారి మృతి

రోడ్డు ప్రమాదంలో పశువైద్యాధికారి మృతి

నల్లగొండ టౌన, జూన 4: జిల్లా కేంద్రంలోని రాంనగర్‌ ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పశు వైద్యాధికారి మృతి చెందారు. టూటౌన ఎస్‌ఐ రావుల నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని కలెక్టరేట్‌ సమీపంలో నివసించే మాతం గి అనుదీప్‌(34) మిర్యాలగూడ మండలం తుంగపహాడ్‌లో పశు వైద్యాధి కారిగా విధులు నిర్వహిస్తున్నారు. సోమవారం విధులు ముగించుకుని షాపింగ్‌ కోసం నల్లగొండకు వచ్చారు. అక్కడి నుంచి రాంనగర్‌ వైపునకు వెళ్తుండగా మైనార్టీ గురుకుల కళాశాల సమీపంలో ఉన్న డివైడర్‌ను ఢీకొని తీవ్రంగా గాయపడ్డా రు. స్థానికుల సమాచారంతో పోలీసులు అంబులెన్సలో చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో నల్లగొండలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మృతి చెం దాడు. మృతుడు అనుదీ్‌పకు భార్య, కుమారుడు ఉన్నారు. మృ తుడి తండ్రి మాతంగి వెంకటేశ్వర్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ నాగరాజు తెలిపారు.

Updated Date - Jun 04 , 2024 | 11:09 PM