Share News

టి-సాట్‌ సీఈవోగా వేణుగోపాల్‌ రెడ్డి బాధ్యతల స్వీకరణ

ABN , Publish Date - Mar 12 , 2024 | 04:03 AM

తెలంగాణ స్కిల్‌, అకడమిక్‌ అండ్‌ ట్రైనింగ్‌(టి-సాట్‌) సీఈవోగా సీనియర్‌ పాత్రికేయులు బోదనపల్లి వేణుగోపాల్‌రెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. టి-సాట్‌ ప్రధాన కార్యాలయంలో మీడియా అకాడమీ ఛైర్మన్‌ శ్రీనివాస్‌ రెడ్డి, తెలంగాణ ఐటీ శాఖ అదనపు కార్యదర్శి కిరణ్‌ కుమార్‌, సీనియర్‌

టి-సాట్‌ సీఈవోగా వేణుగోపాల్‌ రెడ్డి బాధ్యతల స్వీకరణ

హైదరాబాద్‌, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ స్కిల్‌, అకడమిక్‌ అండ్‌ ట్రైనింగ్‌(టి-సాట్‌) సీఈవోగా సీనియర్‌ పాత్రికేయులు బోదనపల్లి వేణుగోపాల్‌రెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. టి-సాట్‌ ప్రధాన కార్యాలయంలో మీడియా అకాడమీ ఛైర్మన్‌ శ్రీనివాస్‌ రెడ్డి, తెలంగాణ ఐటీ శాఖ అదనపు కార్యదర్శి కిరణ్‌ కుమార్‌, సీనియర్‌ జర్నలిస్టుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వేణుగోపాల్‌ రెడ్డి మాట్లాడుతూ... ప్రజా ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు చేరవేసే దిశగా టి-సాట్‌ను విస్తరించడానికి ప్రణాళికలు రూపొందిస్తామన్నారు.

Updated Date - Mar 12 , 2024 | 04:03 AM