Share News

వాహనాలు కండీషన్‌లో ఉంచుకోవాలి

ABN , Publish Date - Jan 05 , 2024 | 11:16 PM

పోలీస్‌ వాహనా లు కండీషన్‌లో ఉంచుకోవాలని ఎస్పీ యోగేష్‌ గౌతమ్‌ అన్నారు.

వాహనాలు కండీషన్‌లో ఉంచుకోవాలి

- ఎస్పీ యోగేష్‌ గౌతమ్‌ - పోలీస్‌ వాహనాల సర్వీసింగ్‌ ర్యాంప్‌ నిర్మాణానికి భూమిపూజ

నారాయణపేట, జనవరి 5: పోలీస్‌ వాహనా లు కండీషన్‌లో ఉంచుకోవాలని ఎస్పీ యోగేష్‌ గౌతమ్‌ అన్నారు. నారాయణపేట జిల్లా పోలీస్‌ హెడ్‌ క్వార్టర్స్‌లో జిల్లా పోలీస్‌ వాహనాలకు సర్వీసింగ్‌ చేయడానికి వాహనాల సర్వీసింగ్‌ ర్యాంప్‌ నిర్మాణానికి అదనపు ఎస్పీ నాగేంద్రుడితో కలిసి ఎస్పీ భూమి పూజ చేశారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీస్‌ వాహనా లు రిపేర్లు ఉండరాదని, వాటిని మరమ్మతులు చేయించి కండిషన్‌లో ఉంచుకోవాలన్నారు. ప్రతీ రోజు క్లీనింగ్‌ చేస్తుండాలని సూచించారు. పో లీసులు ఒత్తిడిని తట్టుకునేందుకు ఖాళీ సమ యంలో క్రీడలు ఆడాలన్నారు. ఇందు కోసం వాలీబాల్‌ కోర్టు ఏర్పాటు చేయించాలని ఆదేశిం చారు. ప్రతీ ఒక్కరు ఫిట్‌గా ఉండాలని అప్పుడే విధుల్లో చురుగ్గా ఉంటారన్నారు. కార్యక్రమం లో ఎస్‌బీ సీఐ శ్రీకాంత్‌రెడ్డి, ఆర్‌ఎస్‌ఐలు శివ శంకర్‌, లలిత, ఆర్మ్‌డ్‌ రిజర్వు పోలీసులు పాల్గొన్నారు.

ఐటీ కోర్‌ టీం ఆధ్వర్యంలో ఒక్కరోజు శిక్షణ..

జిల్లాలోని అన్ని పీఎస్‌ టెక్‌ టీమ్‌ ఆపరేటర్స్‌, స్టేషన్‌ రైటర్స్‌లకు జిల్లా పోలీస్‌ కార్యాలయం లో ని వీసీ హాల్‌లో వీసీ ద్వారా ఐటీ కోర్‌ టీం సభ్యు లు ఒక్కరోజు శిక్షణ ఇచ్చారు. తెలంగాణ పోలీస్‌ శాఖ ఉపయోగించే ఆధునిక సాంకేతిక పరిజ్ఞా నం గురించి అవగాహన కల్పించారు. సాంకేతిక తను సమర్థవంతంగా ఉపయోగించడంలో ఒర్టిక ల్‌ అధికారులకు సహకరిస్తూ అవసరమైనప్పుడు యాప్స్‌ నిర్వహణ విషయంలో శిక్షణ ఇస్తూ సాం కేతికతను ఉపయోగించుకుంటూ విధులు నిర్వ ర్తించాలని సూచించారు. పీఎస్‌లకు సంబంధిం చి ముఖ్యమైన వివరాలు ఆన్‌లైన్‌లో పంపాలని, సంబంధిత అంశాలు ఆన్‌లైన్‌లో పొందుపరచా లని ఫిర్యాదులు ఉంటే ఎస్‌హెచ్‌వో దృష్టికి తీసు కెళ్లాలని సూచించారు. నేరాలు, ప్రమాదాలు, సీసీ టీవీ, ల్యాండ్‌ మార్క్స్‌ జియో ట్యాగ్‌ ద్వారా క్రైమ్‌ మ్యాపింగ్‌లో అప్‌డెట్‌ అవు తున్నాయా లేదా అ నేది చూడాలని, విధి నిర్వహ ణలో ఏర్పడే సం దేహాలు, విఽధానాలు అమలు గు రించి ఐటీ కోర్‌ టీం సభ్యుల సహాయం తీసుకొని విధులు నిర్వ హించాలని తెలిపారు. సమావేశంలో పీఎస్‌లోని టేక్‌ టీం ఆపరేటర్స్‌, రైటర్స్‌ పాల్గొన్నారు.

Updated Date - Jan 05 , 2024 | 11:16 PM