Share News

ఎంసీపీఐ (యు) ఎంపీ అభ్యర్థిగా వస్కుల మట్టయ్య

ABN , Publish Date - Mar 16 , 2024 | 12:12 AM

రానున్న పార్లమెం ట్‌ ఎన్నికల్లో నల్లగొండ పార్లమెంట్‌ స్థానానికి ఎంసీపీఐ (యు) పార్టీ అభ్యర్థిగా ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు వస్కుల మట్టయ్యను ఖరారు చేశారు.

 ఎంసీపీఐ (యు) ఎంపీ అభ్యర్థిగా వస్కుల మట్టయ్య
వస్కుల మట్టయ్యను ఎంపీ అభ్యర్థిగా ప్రకటిస్తున్న ఎంసీపీఐ(యు) జాతీయ కార్యదర్శి అశోక్‌ ఓంకార్‌, బీఎల్‌ఎఫ్‌ చైర్మన నల్ల సూర్యప్రకాష్‌

ఎంసీపీఐ (యు) ఎంపీ అభ్యర్థిగా వస్కుల మట్టయ్య

నల్లగొండ, మిర్యాలగూడ, మార్చి 15: రానున్న పార్లమెం ట్‌ ఎన్నికల్లో నల్లగొండ పార్లమెంట్‌ స్థానానికి ఎంసీపీఐ (యు) పార్టీ అభ్యర్థిగా ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు వస్కుల మట్టయ్యను ఖరారు చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం వస్కుల మ ట్టయ్య మాట్లాడుతూ హైదరాబాద్‌లోని ఓంకార్‌ భవనలో జరిగి న రాష్ట్ర కమిటీ జనరల్‌బాడి సమావేశంలో ఈ మేరకు పార్టీ ని ర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రానున్న పార్లమెంట్‌ ఎన్నికలు దేశ భవిష్యత్తుకు అత్యంత కీలకంగా మారనున్నట్లు తెలిపారు. కార్పొరేట్లకు రాయితీలు ఇచ్చి విరాళాల రూపంలో దండుకున్న బీ జేపీ ప్రజా సమస్యలను విస్మరించిందన్నారు. దేశ రాజ్యాంగాన్ని మార్చి హిందుత్వ ఎజెండా కిందకు తేవడానికి ఆర్‌ఎ్‌సఎ్‌సతో కలిసి రహస్య ఎజెండాను అ మలు చేస్తుందన్నారు. భిన్న సంస్కృతులు, జాతుల, మతాలతో భిన్నత్వంలో ఏకత్వంగా మ నగలుగుతున్న ప్రజలను మతం పేర చీల్చేందుకు యత్నిస్తోందన్నారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ శక్తులను గద్దెదించేందుకు ప్రజలంతా ఐక్యంగా ముందుకు సాగాలన్నారు. తన అభ్యర్థిత్వాన్ని బలపరిచిన బీఎల్‌ఎఫ్‌ రాష్ట్ర చైర్మన నల్ల సూర్యప్రకాశకు, ఎంసీపీఐ (యు) జాతీ య కార్యదర్శి అశోక్‌ ఓంకార్‌కు కృతజ్జతలు తెలియజేశారు. కార్యక్రమంలో ఎంసీపీఐ (యు) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి, కార్యదర్శివర్గ సభ్యులు వరికుప్పల వెంకన్న, ఎస్‌కె.నజీర్‌, రాష్ట్ర కమిటీ సభ్యులు సైదమ్మ, కాశి, గోపి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 16 , 2024 | 12:12 AM