Share News

కంటోన్మెంట్‌ బీజేపీ అభ్యర్థిగా వంశ తిలక్‌

ABN , Publish Date - Apr 17 , 2024 | 03:49 AM

సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ అసెంబ్లీ నియోజవర్గ ఉప ఎన్నిక అభ్యర్థిని బీజేపీ అధిష్ఠానం ప్రకటించింది. అక్కడ బీజేపీ తరఫున డాక్టర్‌ టీఎన్‌ వంశ తిలక్‌

కంటోన్మెంట్‌ బీజేపీ అభ్యర్థిగా వంశ తిలక్‌

న్యూఢిల్లీ, సికింద్రాబాద్‌, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి): సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ అసెంబ్లీ నియోజవర్గ ఉప ఎన్నిక అభ్యర్థిని బీజేపీ అధిష్ఠానం ప్రకటించింది. అక్కడ బీజేపీ తరఫున డాక్టర్‌ టీఎన్‌ వంశ తిలక్‌ బరిలో నిలుస్తారని వెల్లడించింది. తెలంగాణలో ఖాళీగా ఉన్న ఒక స్థానంతోపాటు ఉత్తరప్రదేశ్‌లోని నాలుగు అసెంబ్లీ స్థానాలకు జరిగే ఉప ఎన్నికలకు సంబంధించిన అభ్యర్థుల జాబితాను బీజేపీ కేంద్రకార్యాలయం మంగళవారం విడుదల చేసింది. వంశ తిలక్‌తోపాటు ఉత్తరప్రదేశ్‌లోని దద్రౌల్‌ నుంచి అరవింద్‌ సింగ్‌, లక్నో ఈస్ట్‌ నుంచి ఓపీ శ్రీవాస్తవ్‌, గైంసారి నుంచి శైలేంద్ర సింగ్‌ శైలు, దుద్ది ఎస్టీ నియోజకవర్గం నుంచి శ్రావణ్‌ గౌడ్‌ను బీజేపీ తమ అభ్యర్థులుగా ప్రకటించింది. కాగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ తొలి ఎస్సీ స్పీకర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన టి.ఎన్‌. సదాలక్ష్మి, స్వాతంత్య్ర సమర యోధుడు డాక్టర్‌ టి.ఎన్‌. నారాయణ కుమారుడే వంశ తిలక్‌. కంటోన్మెంట్‌ సీటు కోసం పలువురు పోటీ పడినా... ఆర్‌ఎ్‌సఎస్‌ నేపథ్యం, రాజకీయ కుటుంబ నేపథ్యం ఉన్న తిలక్‌నే బరిలో దించేందుకు బీజేపీ నిర్ణయించింది. లోక్‌సభ ఎన్నికలతోపాటే మే 13న కంటోన్మెంట్‌ ఎన్నిక కూడా జరగనుంది. అదేవిధంగా.. లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి 12వ జాబితాను కూడా బీజేపీ ప్రకటించింది. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లో ఏడు లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.

Updated Date - Apr 17 , 2024 | 03:49 AM