Share News

ప్రిన్సిపాల్‌ వేధింపులతోనే వైష్ణవి ఆత్మహత్య

ABN , Publish Date - Feb 12 , 2024 | 02:33 AM

‘భోజనం బాగాలేదని ఉన్నతాధికారులకు చెప్పడమే మా బిడ్డ చేసిన తప్పయింది. అది మనసులో పెట్టుకుని ఆమెను ప్రిన్సిపాల్‌ ఝాన్సీ వేధించారు. దీంతోనే ఆత్మహత్య చేసుకుంది’’ అంటూ సూర్యాపేట మండలం ఇమాంపేట సాంఘిక సంక్షేమ గురుకులం

ప్రిన్సిపాల్‌ వేధింపులతోనే వైష్ణవి ఆత్మహత్య

భోజనంపై ఫిర్యాదు చేసిందని కక్ష.. తల్లిదండ్రుల ఆరోపణ

పాఠశాల ఎదుట ఆందోళనలో పాల్గొన్న ఆర్‌ఎస్ ప్రవీణ్‌

సూర్యాపేట రూరల్‌, ఫిబ్రవరి 11: ‘‘భోజనం బాగాలేదని ఉన్నతాధికారులకు చెప్పడమే మా బిడ్డ చేసిన తప్పయింది. అది మనసులో పెట్టుకుని ఆమెను ప్రిన్సిపాల్‌ ఝాన్సీ వేధించారు. దీంతోనే ఆత్మహత్య చేసుకుంది’’ అంటూ సూర్యాపేట మండలం ఇమాంపేట సాంఘిక సంక్షేమ గురుకులం ఇంటర్‌ విద్యార్థిని దగ్గుపాటి వైష్ణవి (17) తల్లిదండ్రులు దగ్గుపాటి వెంకన్న, భాగ్యమ్మ ఆరోపించారు. వైష్ణవి శనివారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఫేర్‌వెల్‌ వేడుకలో పాల్గొని, తల్లిదండ్రులకు వీడియో కాల్‌ ద్వారా ఆ విషయాలను నవ్వుతూ చెప్పిన ఆమె.. తర్వాత గంటలోనే తరగతి గదిలో తోటి విద్యార్థినులకు విగత జీవిగా కనిపించింది. ఈ నేపథ్యంలో ప్రిన్సిపాల్‌ను సస్పెండ్‌ చేయాలని వైష్ణవి తల్లిదండ్రులు, విద్యార్థి, కుల సంఘాల వారు ఆదివారం పాఠశాల ఎదుట ధర్నాకు దిగారు. సూర్యాపేట-నేరేడుచర్ల ప్రధాన రహదారిపై బైఠాయించడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. వైష్ణవి కుటుంబాన్ని పరామర్శించిన బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌.. ధర్నాలో పాల్గొని రోడ్డుపై బైఠాయించారు. వైష్ణవి మృతి పై విచారణ అధికారిగా నియమితులైన సూర్యాపేట అదనపు కలెక్టర్‌ వెంకట్‌రెడ్డి హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కాగా, మూడు రోజుల క్రితమే ఇమాంపేట గురుకులంలో ముగ్గురు విద్యార్థినులకు ఫుడ్‌ పాయిజన్‌ కాగా ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స చేయించారు. తల్లిదండ్రులు వచ్చి అడగ్గా, ఏం చెప్పకుండా వారిని గది నుంచి పంపించినట్లు తెలిసింది.

Updated Date - Feb 12 , 2024 | 02:33 AM