Share News

టీకీకరణ ప్రధాన లక్ష్యం

ABN , Publish Date - Nov 13 , 2024 | 11:45 PM

టీకీకరణ ద్వారా చిన్నారుల్లో 12 రకాల ప్రా ణాంతక వ్యాధులను నివారించవచ్చని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్‌ కేవీ.స్వరాజ్య లక్ష్మి అన్నారు.

టీకీకరణ ప్రధాన లక్ష్యం
మాట్లాడుతున్న జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్‌ కేవీ స్వరాజ్యలక్ష్మి

- జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్‌ కేవీ స్వరాజ్యలక్ష్మి

కందనూలు, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి) : టీకీకరణ ద్వారా చిన్నారుల్లో 12 రకాల ప్రా ణాంతక వ్యాధులను నివారించవచ్చని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్‌ కేవీ.స్వరాజ్య లక్ష్మి అన్నారు. జిల్లా వైద్యారోగ్య శాఖ ప్రపంచ ఆరోగ్య సంస్థ సంయుక్తంగా జిల్లాలోని వైద్యాధి కారులకు పర్యవేక్షణ సిబ్బందికి బుధవారం ఒక రోజు టీకీకరణపై వర్క్‌షాపు కలెక్టరేట్‌ సమావేశ హాల్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మా ట్లాడుతూ వైద్య సిబ్బం ది గర్భవతులను నమో దు చేసుకున్న వెంటనే ధనుర్వాత టీకాను పుట్టి న చిన్నారి నుంచి 16 సంవత్సరాల వయస్సు వరకు 12 ప్రాణాంతక వ్యాధులు రాకుండా వందశాతం టీకాకరణ ల క్ష్యాన్ని సాధించాలని తెలిపారు. ఈ టీకాలను ప్రతీ తండా, గ్రామం, పట్టణంలోని వార్డుల్లో ముందస్తు ప్రణాళిక ప్రకారం నిర్వహిస్తున్నాని తెలిపారు. ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలు, ఇతర వైద్య సిబ్బంది టీకీకరణపై అవగాహన కల్పిం చాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఉప వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్‌ ఎం.వెంకట దాస్‌, డాక్టర్‌ తారాసింగ్‌, డాక్టర్‌ కృష్ణమోహన్‌, జిల్లాలోని అన్ని ప్రాథమిక వైద్యాధికారులు, పర్యవేక్షక సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Nov 13 , 2024 | 11:45 PM