Share News

పోలింగ్‌ సిబ్బందికి తగిన సౌకర్యాలు కల్పించాలి : యూటీఎఫ్‌

ABN , Publish Date - Apr 03 , 2024 | 02:59 AM

పార్లమెంట్‌ ఎన్నికల విధులు నిర్వహించే ఉపాధ్యాయులకు తగిన సౌకర్యాలను కల్పించాలని యూటీఎఫ్‌ అధ్యక్ష,

పోలింగ్‌ సిబ్బందికి తగిన సౌకర్యాలు కల్పించాలి : యూటీఎఫ్‌

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): పార్లమెంట్‌ ఎన్నికల విధులు నిర్వహించే ఉపాధ్యాయులకు తగిన సౌకర్యాలను కల్పించాలని యూటీఎఫ్‌ అధ్యక్ష, కార్యదర్శులు జంగయ్య, చావ రవి డిమాండ్‌ చేశారు. ఈమేరకు వారు మంగళవారం ఎన్నికల అధికారి వికాస్‌ రాజ్‌ను కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. అన్ని పోలింగ్‌స్టేషన్లలో పోలింగ్‌ సిబ్బందికి ఆహారం, కనస సౌకర్యాలను కల్పించాలని కోరారు. గత ఎన్నికల్లో కొన్ని పోలింగ్‌ కేంద్రాల్లో మహిళా సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడ్డారని గుర్తుచేశారు.

Updated Date - Apr 03 , 2024 | 07:57 AM