Share News

చివ్వెంలలో ఇద్దరి బలవన్మరణం

ABN , Publish Date - Jul 08 , 2024 | 12:37 AM

సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలంలో శనివారం వేర్వేరు కారణాలతో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు.

చివ్వెంలలో ఇద్దరి బలవన్మరణం

చివ్వెంలలో ఇద్దరి బలవన్మరణం

తల్లి మందలించిందని ఒకరు

అనారోగ్యంతో మరొకరు ఆత్మహత్య

చివ్వెంల, జూలై 7: సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలంలో శనివారం వేర్వేరు కారణాలతో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. చివ్వెంల ఎస్‌ఐ రత్నం తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రంలోని కుడకుడకు చెందిన జి.మహేష్‌ (28)కు ఏడాది క్రితం గాయంవారిగూడెం గ్రామానికి చెందిన నాగలక్ష్మితో వివాహమైంది. వీరి మధ్య మనస్పర్థలు రావడంతో ఆరు నెలల క్రితం విడిపోయారు. అప్పటినుంచి మద్యానికి బానిసైన మహే్‌షను తల్లి మందలించింది. శనివారం సాయంత్రం తల్లితో గొడవపడి ఇంట్లో క్రిమిసంహారక మందు తాగాడు. గమనించిన తల్లి మహే్‌షను సూర్యాపేటలోని ప్రభు త్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం ఉద యం మృతి చెందాడు. తల్లి ఎల్లమ్మ ఫిర్యాదు మేరకు కేసు న మోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

అనారోగ్యంతో బాధపడుతూ ఓ కిరాణా వ్యాపారి ఆత్మహత్య చేసుకున్నా డు. చివ్వెంల ఎస్‌ఐ రత్నం తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని గుంజలూరు గ్రామానికి చెందిన పెదపోలు శ్రీనివాస్‌(40) కిరాణ దుకాణం నడుపు తూ కుటుంబా న్ని పోషిస్తున్నాడు. మూడేళ్ల నుంచి తీవ్రమైన గ్యా స్ర్టిక్‌ సమస్యతో బాధపడుతున్నాడు. పలు ఆసుపత్రుల్లో చికిత్స తీసుకున్నా తగ్గకపోవడంతో కొద్ది కాలంగా మనోవేదనకు గురవుతున్నాడు. శనివారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరేసుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత గమనిం చిన భార్య రజిత శ్రీనివా్‌సను ఆసుపత్రికి తీసుకెళ్లగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడు శ్రీనివాస్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రత్నం తెలిపారు.

Updated Date - Jul 08 , 2024 | 12:37 AM