Share News

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి

ABN , Publish Date - Mar 29 , 2024 | 12:04 AM

రెండు వేర్వే రు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందగా, ఒకరికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదాలు నల్లగొండ జిల్లా మండల పరిధిలోని కాకులకొండారం, యాదాద్రిభువనగిరి జిల్లా భువనగిరి మండలంలోని రెడ్డినాయక్‌తండా లో చోటుచేసుకున్నాయి.

 వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి
అనిల్‌కుమార్‌ (ఫైల్‌)

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి

నల్లగొండలో భర్త మృతి, భార్యకు గాయాలు

నల్లగొండ టౌన, భువనగిరి రూరల్‌, మార్చి 28: రెండు వేర్వే రు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందగా, ఒకరికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదాలు నల్లగొండ జిల్లా మండల పరిధిలోని కాకులకొండారం, యాదాద్రిభువనగిరి జిల్లా భువనగిరి మండలంలోని రెడ్డినాయక్‌తండా లో చోటుచేసుకున్నాయి.

రోడ్డు ప్రమాదంలో భర్త మృతి చెందగా భార్యకు గాయాలయ్యాయి. ఈ ప్రమాదం పట్టణంలోని వనటౌన పోలీ్‌సస్టేషన పరిధిలో జరిగింది. వనటౌన సీఐ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.... మండల పరిధిలోని కాకులకొండారం గ్రామాని కి చెందిన కుడుతాల నర్సింహ(42) నల్లగొండ మునిసిపాలిటీ లో అవుట్‌సోర్సింగ్‌ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. రోజువారీగా బుధవారం నల్లగొండకు వచ్చి విధులు ముగించుకొని ఇంటికి వెళ్తున్నాడు. కిరాణ సామగ్రి కోసం నల్లగొండకు వచ్చిన భార్య చంద్రకళను తన ద్విచక్ర వాహనంపై ఎక్కించుకొని ఇంటికి బ యలుదేరారు. ఈ క్రమంలో బైక్‌ మునుగోడు రోడ్డులోని రాఘవేంద్ర బీఈడీ కళాశాల వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న బైక్‌ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నర్సింహ, అతని భార్య చంద్రకళకు తీవ్రగాయాలయ్యాయి. గమనించిన వాహనదారులు 108కు స మాచారం అందించడంతో ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ భర్త నర్సింహ గురువారం తెల్లవారుజామున మృ తి చెందాడు. భార్య చంద్రకళ ఆ స్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఆ యన తెలిపారు. మృతుడు నర్సింహకు ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతుడి సోదరుడు స్వామి ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేసుకొ ని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సత్యనారాయణ తెలిపారు.

యాదాద్రిభువనగిరి జిల్లా భువనగిరి మండలంలోని రెడ్డినాయక్‌తండాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. భువనగిరి రూరల్‌ ఎస్‌ఐ సంతో్‌షకుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని బొల్లేపల్లికి చెందిన వనం సుమన (24) హైదరాబాద్‌ లో జరిగిన బంధువుల పెళ్లికి హాజరై ఇంటికి తన ద్విచక్ర వాహనంపై తిరుగుపయనవయ్యాడు. మార్గమధ్యలో మండలంలోని రెడ్డినాయక్‌తం డా వద్ద అదుపుతప్పి విద్యుత స్తంభానికి ఢీకొట్టాడు. దీంతో సుమన తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించగా అప్పటికే సుమన మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. సుమన వరుసకు సోదరుడు వనం రమేష్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - Mar 29 , 2024 | 12:04 AM