Share News

తుంగతుర్తిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం : సామేలు

ABN , Publish Date - Mar 11 , 2024 | 12:21 AM

బీఆర్‌ఎస్‌ పాలనలో నిర్లక్ష్యానికి గురైన తుంగతుర్తి నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే మందుల సామేల్‌ అన్నారు.

తుంగతుర్తిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం : సామేలు
మోత్కూరులో మాట్లాడుతున్న ఎమ్మెల్యే మందుల సామేలు

మోత్కూరు, మార్చి 10: బీఆర్‌ఎస్‌ పాలనలో నిర్లక్ష్యానికి గురైన తుంగతుర్తి నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే మందుల సామేల్‌ అన్నారు. మోత్కూరులో మూతపడిన అంగడి(పశువుల సంత, తైబజార్‌ను)ని మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ గుర్రం కవితలక్ష్మీనర్సింహారెడ్డితో కలిసి ఆదివారం ప్రారంభించారు. వందల ఏళ్ల చరిత్ర కలిగిన అంగడి లాక్‌డౌన్‌ కారణంగా మూతపడితే గత పాలకులు దాన్ని అలాగే వదిలేశారన్నారు. నియోజ కవర్గంలో గత పాలకులు వారికి కమీషన్లు వచ్చే పనులకే ప్రాధాన్యత ఇచ్చారని, అభివృద్ధిని పట్టించుకోలేదని విమర్శించారు. మోత్కూరు మెయిన్‌రోడ్డును ఎస్‌బీఐ నుంచి పాతబస్టాండ్‌ వరకు సీసీ, మిగితా రోడ్డంతా బీటీ చేయిస్తానన్నారు. ఇటీవల తాను సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి మోత్కూరుకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల, తిరుమలగిరికి జూని యర్‌ కళాశాల మంజూరు చేయాలని కోరగా వెంటనే జూనియర్‌ కళాశాల మంజూరు చేశారన్నారు. మోత్కూరు, అడ్డగూడూరు మండ లాలకు సాగు నీరందించే బునాదిగాని కాల్వను పూర్తి చేయిస్తాన న్నారు. తిరుమలగిరి మండలం తాటిపాముల, అడ్డగూడూరు మం డలం జానకిపురం గ్రామాల మధ్య బిక్కేరు వాగులో బ్రిడ్జి నిర్మా ణానికి కృషిచేస్తున్నట్టు చెప్పారు. మోత్కూరులో 30పడకల ఆస్పత్రి, మోత్కూరు రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటుకు కృషి చేస్తున్నా నన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షుడు గుండగోని రామచంద్రు, పైళ్ల సోమిరెడ్డి, డాక్టర్‌ జి.లక్ష్మీనర్సింహారెడ్డి, సీపీఐ, బీజేపీ, సీపీఎం నాయకులు యానాల దామోదర్‌రెడ్డి, చేడె చంద్రయ్య, కొణతం నాగార్జునరెడ్డి, కూరపాటి రాములు, అన్నెపు వెంకట్‌ పాల్గొన్నారు.

అడ్డగూడూరు: బిక్కేరుపై ఉండే చెక్‌ డ్యామ్‌లు త్వరగా పూర్తి చేయిస్తానని ఎమ్మెల్యే మందుల సామేలు అన్నారు. మండలంలోని ధర్మారం చెక్‌ డ్యామ్‌ను ఆదివారం పరిశీలించారు. గత కాంట్రాక్టర్ల నిరక్ష్యంతో ఇప్పటికి రెండు, మూడు చెక్‌ డ్యామ్‌ కొట్టుకపో యిందన్నారు. ఈ చెక్‌ డ్యామ్‌ను నెల రోజుల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో కాంగెస్‌ నాయకులు వళ్లంభట్ల రవీందర్‌, కన్నేబోయిన గంగరాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 11 , 2024 | 12:21 AM