Share News

టీఎస్‌ ఐసెట్‌-24 నోటిఫికేషన్‌ విడుదల

ABN , Publish Date - Mar 06 , 2024 | 04:23 AM

రాష్ట్ర వ్యాప్తంగా ఎంబీఏ, ఎంసిఏ కోర్సుల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన టీఎస్‌ ఐసెట్‌-24 పరీక్ష నోటిఫికేషన్‌ మంగళవారం విడుదలైంది. ప్రవేశ పరీక్షను ఈ ఏడాది జూన్‌4, 5 తేదీల్లో మూడు సెషన్స్‌ల్లో

టీఎస్‌ ఐసెట్‌-24 నోటిఫికేషన్‌ విడుదల

రేపట్నుంచి దరఖాస్తుల స్వీకరణ.. జూన్‌ 4, 5 తేదీల్లో పరీక్షలు

హైదరాబాద్‌, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా ఎంబీఏ, ఎంసిఏ కోర్సుల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన టీఎస్‌ ఐసెట్‌-24 పరీక్ష నోటిఫికేషన్‌ మంగళవారం విడుదలైంది. ప్రవేశ పరీక్షను ఈ ఏడాది జూన్‌4, 5 తేదీల్లో మూడు సెషన్స్‌ల్లో నిర్వహించనున్నట్లు ఐసెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ నర్సింహాచారి వెల్లడించారు. తెలంగాణలో 16 చోట్ల ఆంధ్రప్రదేశ్‌లో 4 కేంద్రాల్లో పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు. ఈనెల 7 నుంచి ఏప్రిల్‌ 30 వరకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ. 550, మిగతా వాళ్లు రూ. 750 రుసుం చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. మే 17 వరకు రూ. 250, మే 27 వరకు రూ. 500 అపరాధ రుసుముతో దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. దరఖాస్తులు సమర్పించిన తర్వాత ఏవైనా తప్పులు దొర్లితే మే 17 నుంచి 20వ తేదీ వరకు సవరించుకోవాలన్నారు. మే28 నుంచి హాల్‌టికెట్లు విడుదల చేయనున్నట్లు చెప్పారు. జూన్‌ 15న ప్రాథమిక కీ విడుదల చేస్తామని, జూన్‌ 16 నుంచి 19 వరకు అభ్యంతరాలను స్వీకరించి తుది కీతోపాటు ఫలితాలను జూన్‌ 28న వెల్లడిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ ఐసెట్‌ కన్వీనర్లు ప్రొఫెసర్‌ పి.వరలక్ష్మి, కామర్స్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ పి.అమరవేణి, బీవోఎస్‌ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కట్ల రాజేందర్‌, ప్రొఫెసర్‌ మంచాల సదానందం, పీహెచ్‌ రాధికరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 06 , 2024 | 04:23 AM