Share News

నిజాలను నిర్భయంగా రాయాలి

ABN , Publish Date - Apr 07 , 2024 | 11:08 PM

జర్నలిస్టులు నిజాలను నిర్భయంగా రాయాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి అన్నారు.

నిజాలను నిర్భయంగా రాయాలి
ఎమ్మెల్యే శ్రీనివాస్‌రెడ్డిని సన్మానిస్తున్న జర్నలిస్టులు

- జర్నలిస్టుల సమావేశంలో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి

పాలమూరు, ఏప్రిల్‌ 7 : జర్నలిస్టులు నిజాలను నిర్భయంగా రాయాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని డీసీసీబీ ఆడిటోరియంలో టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా సర్వసభ్య సమావేశం జిల్లా అధ్యక్షుడు దండు దత్తేందర్‌ అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిథులుగా సం ఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరహత్‌అలీ, రాష్ట్ర కార్యదర్శి పేపర్‌ శ్రీను హాజ రయ్యారు. కార్యక్రమంలో వారు మాట్లాడుతూ సురవరం ఆదర్శాలను ముందు కు తీసుకువెళ్దామన్నారు. జర్నలిజాన్ని కాపాడుకునేందుకు అందరం ఐక్యంగా పని చేయాలన్నారు. ఇళ్ల విషయంలో జర్నలిస్టులకు అన్యాయం జరిగిందన్నారు. మాజీ మంత్రి పక్షపాత వైఖరితో జర్నలిస్టులకు అన్యాయం జరిగిందన్నారు. యూనియన్‌లకు అతీతంగా ప్రతీ జర్నలిస్టుకు న్యాయం చేయటమే సంఘం లక్ష్యంగా పని చేద్దామన్నారు. తొందరలోనే జర్నలిస్టులకు తీపి కబురు చెబుతా మని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, మునిసిపల్‌ చైర్మన్‌ ఆనంద్‌కుమార్‌గౌడ్‌లను శాలువా సన్మానించారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరహత్‌అలీ, రాష్ట్ర కార్యదర్శి పేపర్‌ శ్రీను, జిల్లా అధ్యక్షుడు దండు దత్తేందర్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి బి.జి రామాంజనేయులు, ఎలకా్ట్రనిక్‌ మీడియా జిల్లా అధ్యక్షుడు జెమిని శేఖర్‌గౌడ్‌, జర్నలిష్టులు పాల్గొన్నారు.

పండుగలు ఐక్యతకు ప్రతీకలు : ఎమ్మెల్యే యెన్నం

మహబూబ్‌నగర్‌ అర్బన్‌, ఏప్రిల్‌ 7 : పండుగలు ఐక్యతకు ప్రతీకలు అని మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని వీరన్నపేటలో ఓ ఫంక్షన్‌హాల్‌లో ఏర్పాటు చేసి ఇఫ్తార్‌ విందుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పవిత్ర రంజాన్‌ మాసం లో ముస్లిం సోదరులు ఎంతో నిష్టతో ఆచరిస్తారన్నారు. కార్యక్రమంలో మునిసి పల్‌ వైస్‌ చైర్మన్‌ షబ్బీర్‌అహ్మద్‌, నాయకులు జాకీర్‌అడ్వకేట్‌, మక్సూల్‌ హుస్సేన్‌, లక్ష్మణ్‌యాదవ్‌ తదితరులు పాలొన్నారు.

ఫ రోజ్‌గార్డెన్‌లోనూ కాంగ్రెస్‌ నాయకుడు రాషద్‌ఖాన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌ విందులో ఎమ్మెల్యే శ్రీనివాస్‌రెడ్డి, మునిసిపల్‌చైర్మన్‌ ఆనంద్‌గౌడ్‌, నాయకులు సిరాజ్‌ఖాద్రి పాల్గొన్నారు.

బ్రాహ్మణులకు ఉత్తరీయాలు అందజేత

పాలమూరు : ఉగాది పర్వదినం సందర్భంగా ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 100మంది బ్రాహ్మణులకు ఉత్తరీయా(కొత్త దుస్తులు)లు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అందజేశారు. పండుగలు ప్రజలకు ఆనందాలు తీసుకువస్తాయని ఎమ్మెల్యే అన్నారు.

Updated Date - Apr 07 , 2024 | 11:08 PM