Share News

విశ్వాస ఘాతకులకు గుణపాఠం నేర్పాలి

ABN , Publish Date - Apr 03 , 2024 | 11:37 PM

తల్లిపాలు తాగి తల్లి రొమ్ము గుద్దినట్లుగా వ్యవహరించి ఇతర పార్టీల్లోకి వెళ్లిన అవకాశవాదులకు, విశ్వాసఘాతకులకు లోక్‌సభ ఎన్నికల్లో గుణపాఠం నేర్పాలని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారక రామారావు పిలుపునిచ్చారు.

విశ్వాస ఘాతకులకు గుణపాఠం నేర్పాలి

ఫబీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారక రామారావు

వికారాబాద్‌, ఏప్రిల్‌ 3 : తల్లిపాలు తాగి తల్లి రొమ్ము గుద్దినట్లుగా వ్యవహరించి ఇతర పార్టీల్లోకి వెళ్లిన అవకాశవాదులకు, విశ్వాసఘాతకులకు లోక్‌సభ ఎన్నికల్లో గుణపాఠం నేర్పాలని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారక రామారావు పిలుపునిచ్చారు. బుధవారం వికారాబాద్‌లోని నర్సింగ్‌ గౌలీకార్‌ ఫంక్షన్‌ హాల్‌లో నిర్వహించిన నియోజకవర్గ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. చేవెళ్ల పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కాసాని జ్ఞానేశ్వర్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. కాంగ్రెస్‌, బీజేపీ రాష్ట్రంలో బీఆర్‌ఎ్‌సను ఖతం చేయాలని చూస్తున్నారు. రంజిత్‌రెడ్డి, విశ్వేశ్వర్‌రెడ్డిలను బీఆర్‌ఎస్‌ నుంచి ఎంపీలుగా గెలిపిస్తే పార్టీలు మారి విశ్వాసఘాతుకానికి పాల్పడ్డారని ఆరోపించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పట్నం మహేందర్‌రెడ్డి, ఆయన సతీమణి పార్టీకి ద్రోహం చేశారన్నారు. వికారాబాద్‌లో మెతుకు ఆనంద్‌ను, తాండూరులో రోహిత్‌రెడ్డిని ఓడించేందుకు పనిచేశారన్నారు. చేవెళ్ల బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్‌ మాట్లాడుతూ, తాను చేసిన అభివృద్ధి కార్యక్రమాలను చూసి తనను ఎంపీగా ఆశీర్వదిస్తే పార్లమెంట్‌ నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ, వికారాబాద్‌ ప్రాంతం అభివృద్ధిపై కేసీఆర్‌ ప్రత్యేకంగా దృష్టి సారిస్తే.. ప్రస్తుత ముఖ్యమంత్రి జిల్లాలో కొడంగల్‌కే కోట్లాది నిధులు మంజూరు చేస్తూ మిగతా మూడు నియోజకవర్గాలకు మొండిచెయ్యి చూపుతున్నారన్నారు. అనంతరం ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, ఎమ్మెల్యే కాలె యాదయ్య, మాజీ ఎమ్మెల్యేలు, మెతుకు ఆనంద్‌, మహే్‌షరెడ్డి, బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నేత కార్తీక్‌రెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో జడీ ్ప వైస్‌ చైర్మన్‌ బైండ్ల విజయకుమార్‌, టీఎ్‌సడబ్ల్యుఐడీసీ మాజీ చైర్మన్‌ నాగేందర్‌గౌడ్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌ రాజుగౌడ్‌, పార్టీ నాయకులు చంద్రకళ, సుజాత, మధుకర్‌, వేణుగోపాల్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, రాంరెడ్డి, విజయకుమార్‌, దేవదాస్‌, అంజి తదితరులు పాల్గొన్నారు.

పార్టీ మారే ప్రసక్తే లేదు: ఎమ్మెల్యే కాలే యాదయ్య

తాను పార్టీ మారే ప్రసక్తే లేదని, బీఆర్‌ఎ్‌సలోనే కొనసాగుతానని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య స్పష్టం చేశారు. పార్టీ మారిన వారికే అక్కడ గౌరవం లేదన్నారు. పార్టీ మారిన కేశవరావు, కడియం శ్రీహరి అనుచరులే పార్టీ మారవద్దని మాకు చెబుతున్నారని యాదయ్య కేటీఆర్‌ దృష్టికి తీసుకువచ్చారు. పార్టీ కార్యకర్తలను, ఉద్యమకారులను దూరం చేసుకోవద్దని కాలే యాదయ్య వికారాబాద్‌ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌కు సూచించారు. ఉద్యమకారులను, పార్టీ కోసం పనిచేసే నాయకులను దూరం చేసుకోవడం వల్లనే ఈ పరిస్థితి ఎదురైందని ఆయన గుర్తు చేశారు.

Updated Date - Apr 03 , 2024 | 11:37 PM