Share News

చాకలి ఐలమ్మకు ఘన నివాళి

ABN , Publish Date - Sep 10 , 2024 | 11:11 PM

భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం జరిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి స్ఫూర్తినిచ్చిన వీర వనిత చాలకి ఐలమ్మ అని కలెక్టర్‌ శశాంక అన్నారు.

చాకలి ఐలమ్మకు ఘన నివాళి
ఐలమ్మ చిత్ర పటం వద్ద నివాళులర్పిస్తున్న కలెక్టర్‌ శశాంక

కలెక్టరేట్‌లో నివాళులర్పించిన కలెక్టర్‌ శశాంక

రంగారెడ్డి అర్బన్‌, సెప్టెంబరు 10 : భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం జరిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి స్ఫూర్తినిచ్చిన వీర వనిత చాలకి ఐలమ్మ అని కలెక్టర్‌ శశాంక అన్నారు. కలెక్టరేట్‌లో మంగళవారం ఆమె వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఐలమ్మ చిత్ర పటానికి పూల సమర్పించి కలెక్టర్‌ నివాళులర్పించారు. కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్‌ అధికారి కేశవ్‌రామ్‌, రజక సంఘం ప్రెసిడెంట్‌ ఆంజనేయులు, జిల్లా రజక సంఘం ప్రెసిడెంట్‌ ఎం.అజయ్‌, బీసీ ఫ్రంట్‌ చైర్మన్‌ మల్లేశ్‌ యాదవ్‌, ఆదిభట్ల మున్సిపల్‌ చైర్మన్‌ నిరంజన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 10 , 2024 | 11:11 PM