Share News

పరిమితిలోపే వైద్యం చేయాలి

ABN , Publish Date - Jan 05 , 2024 | 11:16 PM

జిల్లాలోని గ్రామీణ వై ద్యసేవకులు తమ పరిమితికి లోబడి ప్రజలకు వైద్యం అందించాలని మ హబూబ్‌నగర్‌ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.

పరిమితిలోపే వైద్యం చేయాలి
విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి

- ఆర్‌ఎంపీల జిల్లా సదస్సులో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి

మహబూబ్‌నగర్‌(వైద్యవిభాగం), జనవరి 5 : జిల్లాలోని గ్రామీణ వై ద్యసేవకులు తమ పరిమితికి లోబడి ప్రజలకు వైద్యం అందించాలని మ హబూబ్‌నగర్‌ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో జిల్లా గ్రామీణ వైద్యుల సంఘం సదస్సు కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన సంఘం నూతన సంవత్సర క్యాలెండర్‌, డైరీని ఆవిష్కరించారు. ప్రథమ చికిత్స వరకే చేయాలని, మెరుగైన వైద్యం కోసం పెద్ద ఆసుపత్రులకు పం పించాలని సూచించారు. గ్రామీణ వైద్యులకు గుర్తింపు కార్డుల విషయమై ప్రభుత్వంతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. ఆర్‌ఎంపీలు రక్తదానం చేశారు. పేద విద్యార్థులకు నోటు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సంఘం జిల్లా వ్యవస్థాపక అధ్యక్షుడు రమేష్‌, జిల్లా అధ్యక్షుడు శ్రావన్‌కుమార్‌, గౌరవ అధ్యక్షుడు సురేందర్‌, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, జీవీఆర్‌కే ఆసుపత్రి వైద్యులు డాక్టర్‌ కృష్ణ పాల్గొన్నారు.

విద్యార్థులు కష్టపడి చదవాలి

మహబూబ్‌నగర్‌ విద్యావిభాగం : విద్యార్థులు కష్టపడి చదివి అన్ని రంగాల్లో రాణించాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శుక్రవా రం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఒకేషనల్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి, యెన్నం పాల్గొ న్నారు. అసంపూర్తిగా ఉన్న ప్రభుత్వ ఒకేషల్‌ జూనియర్‌ కళాశాల భవనా న్ని పూర్తి చేస్తామన్నారు. విద్యార్థులకు అన్ని సదుపాయలు కల్పిస్తామ న్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలను కళాశాల అధ్యాపకులు, విద్యార్థు లు సన్మానించారు. కార్యక్రమంలో టీపీసీసీ అధికార ప్రతినిధి గాలిరెడ్డి హర్షవర్ధన్‌రెడ్డి, డీఐఈవో వెంకటేశ్వర్లు, ఒకేషనల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ పి.గోపాల్‌, బాలుర జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ భగవం త్‌రావు, అధ్యాపకులు నర్సింహారెడ్డి, శ్రీనివాస్‌, నాయకులు సిరాజ్‌ఖాద్రి, రాజేందర్‌ రెడ్డి, శేఖర్‌నాయక్‌, లక్ష్మణ్‌నాయక్‌, ప్రవీణ్‌ కుమార్‌ పాల్గొన్నారు .

ఫ భవన నిర్మాణ కార్మికుల పిల్లలకు సెట్విన్‌ సంస్థ, తెలంగాణ బిల్డింగ్‌ అదర్‌ కన్‌స్ట్రక్షన్‌ వర్కర్స్‌ వెల్ఫేర్‌ ఆధ్వ ర్యంలో ఏర్పాటు చేసిన శిక్షణ శిబిరాన్ని శుక్రవారం ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి పరిశీలించారు. శిక్షణ పొందిన విద్యా ర్థులకు ఎమ్మెల్యే ధ్రువపత్రాలు అందజేశారు. ఈ కార్యక్ర మంలో సెట్విన్‌ సంస్థ నిర్వాహకులు సిద్ధిక్‌, మాధురి, సూరిబాబు నాగేశ్వ రరావు, బాలుర జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ భగవంతచారి, అధ్యాప కులు నర్సింహారెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు.

హాస్టల్‌ విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ

గత ప్రభుత్వం విద్యావ్యవస్థను నిర్వీర్యం చేసిందని, అప్పట్లో వసతి గృహల్లో కనీస వసతులు కల్పించలేదని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి ఆరోపించారు. శుక్రవారం రాత్రి జిల్లా కేంద్రంలోని టీచర్స్‌కాలనీలో గల ప్రభుత్వ బీసీ సంక్షేమ శాఖ కళాశాల బాలికల వసతి గృహంలో విద్యా ర్థులకు ఎమ్మెల్యే తన సొంత ఖర్చులతో దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఆధికార ప్రతినిధి హర్షవర్థన్‌రెడ్డి, ప్రవీణ్‌కుమార్‌, ప్రియదర్శిని, నండురి శ్రీనివాస్‌, కొండయ్య పాల్గొన్నారు.

Updated Date - Jan 05 , 2024 | 11:16 PM