పారదర్శకంగా ర్యాండమైజేషన్
ABN , Publish Date - Apr 03 , 2024 | 11:35 PM
పారదర్శకంగా రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో మొదటి దశ ఈవీఎం, బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్, వీవీ ప్యాట్ యంత్రాల ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేశామని మేడ్చల్-మల్కాజిగిరి పార్లమెంటరీ నియోజకవర్గ ఎన్నికల అధికారి , కలెక్టర్ గౌతమ్ అన్నారు.

మేడ్చల్-మల్కాజ్‌గిరి కలెక్టర్ గౌతమ్
మేడ్చల్ ఏప్రిల్ 3(ఆంధ్రజ్యోతిప్రతినిధి): పారదర్శకంగా రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో మొదటి దశ ఈవీఎం, బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్, వీవీ ప్యాట్ యంత్రాల ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేశామని మేడ్చల్-మల్కాజిగిరి పార్లమెంటరీ నియోజకవర్గ ఎన్నికల అధికారి , కలెక్టర్ గౌతమ్ అన్నారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్‌రెడి ్డ, డీఆర్‌వో హరిప్రియలతో కలిసి జిల్లా ఎన్నికల అధికారి ఈవీఎంల మొదటి దశ ర్యాండమైజేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని మేడ్చల్, మల్కాజిగిరి, కూకట్‌పల్లి, కుత్భుల్లాపూర్, ఉప్పల్ ఐదు నియోజకవర్గాల్లో గల 2425 పోలింగ్ కేంద్రాలకు గాను ఆన్‌లైన్ ద్వారా ఈవీఎం యంత్రాలను కేటాయించడం జరిగిందన్నారు. మేడ్చల్ నియోజకవర్గం పరిధిలో 591 పోలింగ్‌కేంద్రాలకు 738కంట్రోల్ యూనిట్లు, 738 బ్యాలెట్ యూనిట్లు, 827వీవీప్యాట్‌లు కేటాయించగా, మల్కాజిగిరి నియోజకవర్గానికి 418 పోలింగ్ కేంద్రాలకు 522 కంట్రోల్ యూనిట్‌లు, 522 బ్యాలెట్‌యూనిట్లు, 585 వీవీ ప్యాట్‌లను, కూకట్‌పల్లి నియోజకవర్గ పరిధిలో 417 పోలింగ్ కేంద్రాలకు 521 కంట్రోల్ యూనిట్లు, 521 బ్యాలెట్ యూనిట్లు, 583వీవీ ప్యాట్‌లు, కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో 592 పోలింగ్ కేంద్రాలకు 740 కంట్రోల్ యూనిట్లు , 740 బ్యాలెట్ యూనిట్లు, 828 వీవీ ప్యాట్‌లు, ఉప్పల్ నియోజకవర్గ పరిధిలో 407 పోలింగ్ కేంద్రాలకు 508 కంట్రోల్ యూనిట్లు, 506 బ్యాలెట్ యూనిట్లు, 569వీవీ ప్యాట్‌లు, మొత్తం 3028 ిసీయులు, 3029 బీయులు, 3393వీవీ ప్యాట్‌లు కేటాయించడం జరిగిందన్నారు. మొద టి ర్యాండమైజేషన్‌కు సంబంధించిన హార్డ్ కాపీలు, సాప్ట్ కాపీలను రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందించడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో ఎన్నికల విభాగం సూపరిండెంట్ రాజేశ్వర్‌రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.
మొత్తం1,148 పోలింగ్ స్టేషన్లు: కలెక్టర్ నారాయణరెడ్డి
వికారాబాద్ : లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం యంత్రాల మొదటిదశ ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేశామని కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లో వివిధ రాజకీయ పార్టీ నాయకుల సమక్షంలో కంట్రోల్, బ్యాలెట్ యూనిట్లు, వీవీప్యాట్ల మొదటి దశ రాండమైజేషన్ నిర్వహించారు. జిల్లాలో మొత్తం1,148 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయన్నారు. మొదటి రాండమైజేషన్ పూర్తి అయిన బ్యాలెట్ యూనిట్లు 2,210, కంట్రోల్ యూనిట్‌లు 1,637, వీవీప్యాట్‌లు 1,734 లను కేటాయించడం జరిగిందని, జాబితాను పార్టీ ప్రతినిధులకు అందజేశారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు రాహుల్‌శర్మ, లింగ్యానాయక్, ఆర్డీవోలు వాసుచంద్ర, శ్రీనివాసరావు, సెక్షన్ సూపరింటెండెంట్ శ్రీనివాస్, నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంతేకాకుండా ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు బుధవారం తహసీల్దార్ కార్యాలయం అవరణలో ఉన్న ఈవీఎం స్ట్రాంగ్‌రూం, పోలీస్ బందోబస్తును కలెక్టర్ పరిశీలించారు. అక్కడున్న సిబ్బందికి సూచనలు చేశారు.రిజిస్టర్లను తనిఖీ చేసి రిజిస్టర్‌లో సంతకాలు చేశారు.
మధ్యాహ్నం బయటకు రావొద్దు
ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో మధ్యాహ్న సమయాల్లో ప్రజలు బయటకు రావద్దని కలెక్టర్ నారాయణరెడ్డి బుధవారం ఓ ప్రకటనలో సూచించారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దన్నారు. ముఖ్యంగా వృద్థులు, పిల్లలు మరింత జాగ్రత్తగా ఉండాలని, ప్రజలు అనారోగ్యం బారిన పడకుండా అధికారులు సూచనలు చేయాల్సిందిగా తెలిపారు. ఎండల్లో పనిచేయడం, ఆటలాడడం చెప్పులు లేకుండా బయట తిరగడం వంటివి చేయొద్దని తెలిపారు. పార్క్ చేసిన వాహనాల్లోకి పిల్లలు, పెంపుడు జంతువులు వెళ్లకుండా చూడాలని సూచించారు.