Share News

ఎంపీడీవోల బదిలీలు

ABN , Publish Date - Feb 11 , 2024 | 11:13 PM

ఎన్నికల బదిలీలు కొనసాగుతున్నాయి. వికారాబాద్‌ జిల్లాలో పనిచేస్తున్న 11 మంది ఎంపీడీవోలను ఇతర జిల్లాలకు బదిలీ చేస్తూ పంచాయతీరాజ్‌ అండ్‌ గ్రామీణ ఉపాధి శాఖ కమిషనర్‌ అనితా రామచంద్రన్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

ఎంపీడీవోల బదిలీలు

వికారాబాద్‌ జిల్లాలో 11 మంది,

మేడ్చల్‌-మల్కాజ్‌గిరి జిల్లాలో ముగ్గురు ట్రాన్స్‌ఫర్‌

వికారాబాద్‌/మేడ్చల్‌, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : ఎన్నికల బదిలీలు కొనసాగుతున్నాయి. వికారాబాద్‌ జిల్లాలో పనిచేస్తున్న 11 మంది ఎంపీడీవోలను ఇతర జిల్లాలకు బదిలీ చేస్తూ పంచాయతీరాజ్‌ అండ్‌ గ్రామీణ ఉపాధి శాఖ కమిషనర్‌ అనితా రామచంద్రన్‌ ఉత్తర్వులు జారీ చేశారు. పెద్దేముల్‌ ఎంపీడీవో బండి లక్ష్మప్ప, పూడూరు ఎంపీడీవో ఉమాదేవి, బంట్వారం ఎంపీడీవో బాలయ్యలను సిద్దిపేట జిల్లాకు బదిలీ చేయగా, దోమ ఎంపీడీవో జయరాం, తాండూరు ఎంపీడీవో సుదర్శన్‌రెడ్డి, దౌల్తాబాద్‌ ఎంపీడీవో తిరుమలస్వామి, పరిగి ఎంపీడీవో శేషగిరిశర్మలు నల్లగొండ జిల్లాకు బదిలీ అయ్యారు. కోట్‌పల్లి ఎంపీడీవో లక్ష్మీనారాయణను జనగాం జిల్లాకు, మోమిన్‌పేట్‌ ఎంపీడీవో శైలజను రంగారెడ్డి జిల్లాకు బదిలీ చేశారు. కులకచర్ల ఎంపీడీవో నాగవేణిని యాదాద్రి-భువనగిరి జిల్లాకు, వికారాబాద్‌ ఎంపీడీవో ఎం.సత్తయ్యను సంగారెడ్డి జిల్లాకు బదిలీ చేశారు. కాగా, రంగారెడ్డి జిల్లా నుంచి బి.నర్సింహులు, జి.విజయలక్ష్మి, జి.హరీ్‌షకుమార్‌, కె.వినయ్‌కుమార్‌, కె.రామకృష్ణ, జె.రాఘవులు, సి.అనురాధ, హెచ్‌.మహే్‌షబాబు, సంగారెడ్డి జిల్లా నుంచి ఎ.రాములు, కె.విశ్వప్రసాద్‌, యాదాద్రి-భువనగిరి జిల్లా నుంచి కె.ప్రభాకర్‌రెడ్డిలను వికారాబాద్‌ జిల్లాకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. జిల్లాలో 18 మండల పరిషత్తుల్లో 18 మంది ఎంపీడీవోలు ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం 15 మంది ఎంపీడీవోలు పనిచేస్తున్నారు. వీరిలో 11మంది ఎంపీడీవోలు మూడేళ్లకు పైగా ఇక్కడే విధులు నిర్వహిస్తుండగా, 4గురు ఎంపీడీవోలు ఇదే జిల్లాకు చెందిన వారు ఉన్నారు. ఇదిలా ఉంటే, బదిలీ అయిన ఎంపీడీవోలను 12వ తేదీలోగా రిలీవ్‌ చేయాలని, బదిలీపై కేటాయించిన జిల్లాల్లో 13వ తేదీలోగా రిపోర్ట్‌ చేయాలని పీఆర్‌ అండ్‌ఆర్‌ఈ కమిషనర్‌ ఆదేశించారు.

మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలో ముగ్గురు

మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలో ముగ్గురు ఎంపీడీవోలు బదిలీ అయ్యారు. జె.పద్మావతి(మేడ్చల్‌), జి.వాణి(శామీర్‌పేట), వై.అరుణరెడ్డి(ఘట్‌కేసర్‌)లు రంగారెడ్డి జిల్లాకు బదిలీ కాగా, రంగారెడ్డి జిల్లా నుంచి ఆర్‌.మమత, జి.వసంత లక్ష్మీ, యాదాద్రి జిల్లాకు చెందిన లెంకెల గీతారెడ్డిలు బదిలీపై మేడ్చల్‌ జిల్లాకు రానున్నారు. కాగా లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఈసీ మార్గదర్శకాల మేరకు శనివారం తహసీల్దార్లను బదిలీ చేయగా, తాజాగా ఎంపీడీవోలను బదిలీ చేస్తూ ఆదివారం ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇదిలా ఉంటే, కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఇతర శాఖల్లోనూ బదిలీలకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఈసీ ఆదేశాలతో బదిలీలు

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మూడేళ్లకు పైగా ఒకే చోట పనిచేస్తున్న అధికారులతో పాటు స్వంత జిల్లాలో పనిచేస్తున్న అధికారులను ఇతర జిల్లాలకు బదిలీ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం గత డిసెంబరు నెలలో ఆదేశాలు జారీచేసిన విషయం తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఈసీ మార్గదర్శకాల మేరకు శనివారం తహసీల్దార్లను బదిలీ చేయగా, తాజాగా ఎంపీడీవోలను బదిలీ చేస్తూ ఆదివారం ఉత్తర్వులు వెలువడ్డాయి. తమను ఎన్నికల బదిలీల నుంచి మినహాయించాలని ఎంపీడీవోలు, డిప్యూటీ సీఈవోలు, జడ్పీ సీఈవోలు, డీపీవోలు, డీఎల్‌పీవోలు, ఎంపీవోలు పంచాయతీరాజ్‌శాఖ మంత్రితో పాటు సంబంధిత శాఖ ఉన్నతాధికారులపైన తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకు వచ్చినా .. చివరకు ఎంపీడీవోలను బదిలీ ,చేస్తూ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉంటే, కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఇతర శాఖల్లోనూ బదిలీలకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

Updated Date - Feb 11 , 2024 | 11:13 PM