Share News

జిల్లాలో 9 మంది ఎస్‌ఐలు బదిలీ

ABN , Publish Date - Feb 06 , 2024 | 10:28 PM

జిల్లాలో తొమ్మిది మంది ఎస్‌ఐలను బదిలీ చేస్తూ పోలీసు ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి తెలిపిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి.

జిల్లాలో 9 మంది ఎస్‌ఐలు బదిలీ

వికారాబాద్‌, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : జిల్లాలో తొమ్మిది మంది ఎస్‌ఐలను బదిలీ చేస్తూ పోలీసు ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి తెలిపిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి. మోమిన్‌పేట్‌ ఎస్‌ఐగా పనిచేస్తున్న పి.విఠల్‌రెడ్డిని కరణ్‌కోట్‌కు బదిలీ చేయగా, అక్కడ పనిచేస్తున్న ఎస్‌ఐ ఎస్‌.మధుసూధన్‌రెడ్డి చెన్‌గోముల్‌కు బదిలీ అయ్యారు. తాండూరు పట్టణ ఎస్‌ఐగా పనిచేస్తున్న ఎ.అరవింద్‌ను మోమిన్‌పేట్‌కు బదిలీ చేశారు. చెన్‌గోముల్‌ ఎస్‌ఐ కె.గిరెన్న పెద్దేముల్‌కు బదిలీ అయ్యారు. బషీరాబాద్‌ ఎస్‌ఐగా పనిచేస్తున్న పి.వేణుగోపాల్‌గౌడ్‌ను ధారూరుకు బదిలీ చేయగా, ధారూరు ఎస్‌ఐ ఎం.సంతోష్‌కుమార్‌ను పరిగి ఎస్‌ఐగా నియమించారు. వీఆర్‌లో ఉన్న వి.రమేష్‌కు బషీరాబాద్‌ ఎస్‌ఐగా పోస్టింగ్‌ ఇచ్చారు. కాగా, పరిగి ఎస్‌ఐ జీవీ సత్యనారాయణ, పెద్దేముల్‌ ఎస్‌ఐ కాశీనాథ్‌లకు పోస్టింగ్‌ ఇవ్వకుండా వీఆర్‌ లో ఉంచారు.

Updated Date - Feb 06 , 2024 | 10:29 PM