Share News

395 మంది ఎంపీడీవోల బదిలీ

ABN , Publish Date - Feb 12 , 2024 | 03:23 AM

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ పరిధిలోని మండల పరిషత్‌ అభివృద్ధి అధికారుల (ఎంపీడీవో) బదిలీలు భారీగా జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా 612 మంది

395 మంది ఎంపీడీవోల బదిలీ

ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

ఈసీ మార్గదర్శకాల నేపథ్యంలోనే..

హైదరాబాద్‌, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ పరిధిలోని మండల పరిషత్‌ అభివృద్ధి అధికారుల (ఎంపీడీవో) బదిలీలు భారీగా జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా 612 మంది ఎంపీడీవోలు ఉండగా.. వీరిలో 395 మందిని బదిలీ చేస్తూ పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ అనితా రామచంద్రన్‌ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల కమిషన్‌ (ఈసీ) మార్గదర్శకాల ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆ ఉత్తర్వుల్లో కలెక్టర్లకు సూచించారు. సొంత జిల్లాల్లో పనిచేస్తున్న వారితోపాటు మూడేళ్లకుపైగా ఒకే చోట పనిచేస్తున్న ఉద్యోగులను ఇతర జిల్లాలకు బదిలీ చేయాలని గత డిసెంబరులో ఈసీ అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. ఈ నేపథ్యంలో వివిధ శాఖలు బదిలీలు చేపట్టాయి. తాజాగా ఎంపీడీవోలను బదిలీ చేశారు.

Updated Date - Feb 12 , 2024 | 03:23 AM