Share News

ఏప్రిల్‌ 1 నుంచి టీఎ్‌సఎస్పీ కానిస్టేబుళ్ల శిక్షణ

ABN , Publish Date - Mar 24 , 2024 | 05:45 AM

రాష్ట్ర పోలీ్‌సశాఖలో ఖాళీల భర్తీ ప్రక్రియలో భాగంగా ఇటీవల ఎంపికైన టీఎ్‌సఎస్పీ కానిస్టేబుల్‌ అభ్యర్థులకు ఏప్రిల్‌ 1 నుంచి శిక్షణ తరగతులు ప్రారంభం కానున్నాయి.

ఏప్రిల్‌ 1 నుంచి టీఎ్‌సఎస్పీ కానిస్టేబుళ్ల శిక్షణ

హైదరాబాద్‌, మార్చి 23(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర పోలీ్‌సశాఖలో ఖాళీల భర్తీ ప్రక్రియలో భాగంగా ఇటీవల ఎంపికైన టీఎ్‌సఎస్పీ కానిస్టేబుల్‌ అభ్యర్థులకు ఏప్రిల్‌ 1 నుంచి శిక్షణ తరగతులు ప్రారంభం కానున్నాయి. ఫేజ్‌-1లో ఇప్పటికే సివిల్‌, ఏఆర్‌ తదితర విభాగాల అభ్యర్థులకు శిక్షణ ప్రారంభం కాగా, శిక్షణ కేంద్రాలు సర్దుబాటు కావడంతో ఫేజ్‌-2లో టీఎ్‌సఎస్పీ కానిస్టేబుల్‌ పోస్టులకు ఎంపికైన 4250 మంది కేడెట్లకు శిక్షణ తరగతులు ప్రారంభిస్తున్నారు. ఆయా పోస్టులకు ఎంపికైన అభ్యర్ధులకు సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ఇదివరకే నియామక పత్రాలు అందజేశారు. టీఎ్‌సఎ్‌సపీ కానిస్టేబుల్‌ అభ్యర్థులు శిక్షణకు సంబంధించిన సమాచారం అధికారిక వెబ్‌సైట్‌ జ్ట్టిఞట://్టటటఞ.్ట్ఛజ్చూుఽజ్చుఽ్చ.జౌఠి.జీుఽ/లో పొందవచ్చని శిక్షణ విభాగం చీఫ్‌ అభిలాష బిస్త్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

Updated Date - Mar 24 , 2024 | 05:45 AM