Share News

నేడు టీపీసీసీ భేటీ

ABN , Publish Date - Mar 29 , 2024 | 05:50 AM

రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారం చేపట్టిన వంద రోజుల్లోహామీల అమలు, సాధించిన విజయాలపై రూపొందించిన నివేదిక, తుక్కుగూడ సభ, లోక్‌సభ ఎన్నికల కార్యాచరణపై శుక్రవారం టీపీసీసీ కార్యవర్గ సమావేశం జరగనుంది. గాంధీభవన్‌లో జరిగే ఈ భేటీలో

నేడు టీపీసీసీ భేటీ

హాజరుకానున్న సీఎం, డిప్యూటీ సీఎం

హైదరాబాద్‌, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారం చేపట్టిన వంద రోజుల్లోహామీల అమలు, సాధించిన విజయాలపై రూపొందించిన నివేదిక, తుక్కుగూడ సభ, లోక్‌సభ ఎన్నికల కార్యాచరణపై శుక్రవారం టీపీసీసీ కార్యవర్గ సమావేశం జరగనుంది. గాంధీభవన్‌లో జరిగే ఈ భేటీలో ఏఐసీసీ ఇన్‌చార్జి దీపాదాస్‌ మున్షీ, సీఎం, పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శులు తదితరులు పాల్గొంటారు. కాంగ్రెస్‌ వంద రోజుల పాలనపై ఒక నివేదికను ప్రవేశపెడతారని సమాచారం. వంద రోజుల పాలన ఆధారంగానే లోకసభ ఎన్నికలకు వెళ్తామంటున్న కాంగ్రెస్‌.. దీనిపై ఒక నివేదికను రూపొందించినట్టు తెలిసింది. ఏప్రిల్‌ 6న తుక్కుగూడలో ఏర్పాటు చేయనున్న బహిరంగసభను విజయవంతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపైనా సమావేశంలో చర్చించనున్నారు. అలాగే లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన కార్యాచరణపై చర్చిస్తారని తెలిసింది. అంతకుముందుగా మధ్యాహ్నం 3 గంటలకు టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌ మధు యాష్కీ అధ్యక్షతన టీపీసీసీ ప్రచార కమిటీ సమావేశం జరగనుంది. సమావేశంలో దీపాదాస్‌ మున్షీ, ప్రచార కమిటీ కోచైర్మన్‌ పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి తదితరులు పాల్గొంటారు. కాగా, లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మంత్రి డి.శ్రీధర్‌బాబు చైర్మన్‌గా మేనిఫెస్టో కమిటీని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ ఏర్పాటు చేశారు. దీనికి కన్వీనర్‌గా సీనియర్‌ నేత అల్దాస్‌ జానయ్య, సభ్యులుగా ఎ.శ్యామ్‌మోహన్‌, బి.కమలాకర్‌రావు, బీఎం వినోద్‌కుమార్‌, మహ్మద్‌ రియాజ్‌, జనక్‌ప్రసాద్‌లను నియమించినట్టు టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కమిటీ మేనిఫెస్టో అంశాలతో పాటు అన్ని వర్గాల ప్రజలకు మేనిఫెస్టోను ఎలా చేరవేయాలన్న దానిపై పార్టీకి 15 రోజుల్లో నివేదిక ఇవ్వనుంది.

Updated Date - Mar 29 , 2024 | 06:48 AM