Share News

దంచికొట్టిన వాన

ABN , Publish Date - Apr 18 , 2024 | 11:58 PM

ఉదయం నుంచి సాయంత్రం వరకు మండుతున్న ఎండలు, ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందిపడ్డారు. గురువారం సాయంత్రం నాగారం, దమ్మాయిగూడ మున్సిపాలిటీల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. వానకు ఈదురు గాలులు తోడవడంతో ఫ్లెక్సీలు కొట్టుకుపోయాయి.

దంచికొట్టిన వాన
నాగారంలో కురుస్తున్న భారీ వర్షం

నాగారం, దమ్మాయిగూడల్లో భారీ వర్షం

కీసరరూరల్‌/ధారూరు, ఏప్రిల్‌18: దంచికొట్టిన వాన

మేడ్చల్‌ జిల్లా నాగారం, దమ్మాయిగూడల్లో భారీ వర్షం

చేవెళ్లలో ఈదురుగాలులతో కూడిన వర్షం

కీసరరూరల్‌/ధారూరు, ఏప్రిల్‌18: ఉదయం నుంచి సాయంత్రం వరకు మండుతున్న ఎండలు, ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందిపడ్డారు. గురువారం సాయంత్రం నాగారం, దమ్మాయిగూడ మున్సిపాలిటీల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. వానకు ఈదురు గాలులు తోడవడంతో ఫ్లెక్సీలు కొట్టుకుపోయాయి. రోడ్లన్నీ జలమయం కాగా, లోతట్టు ప్రాంతల్లోకి వరదనీరు భారీగా వచ్చి చేరింది. అకాల వర్షంతో రోడ్లపై ఉన్న గుంతల్లోకి వర్షపునీరు చేరడంతో వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అంతేకాకుండా కీసర, ధారూరులో చిరుజల్లులు కుసిశాయి. ఉదయం నుంచి ఎండతో ఇబ్బందులు పడిన జనాలకు సాయంత్రం కురిసిన వర్షం ఎంతో ఉపశమనం కలిగింది. చేవెళ్లలో ఉరుములు, మెరుపులు, గాలులతో కూడిన వర్షం కురిసింది. అరగంట పాటు ఆకాశంలో మెరుపులు, ఉరుములతో వానకాలాన్ని తలపించేలా చిన్నపాటి వర్షం కురిసింది. చేవెళ్ల మండలంలో కొద్దిసేపు విద్యుత్‌ అంతరాయం ఏర్పడింది. షాబాద్‌, మొయినాబాద్‌ మండలాల్లో సైతం చిరుజల్లులు కురిశాయి. తాత్కాలికంగా వాతావరణం చల్లబడి జనం కొంత ఉపశమనం పొందారు. ఇటు యాచారం మండలంలోని గున్గల్‌ రిజర్వ్‌ ఫారెస్టు నుంచి యాచారం వరకు గురువారం మధ్యాహ్నం 20నిమిషాల పాటు చిరు జల్లు కురిసింది. బుధవారం ఉష్ణోగ్రత 42 డిగ్రీలుండగా గురువారం 40 డిగ్రీలు నమోదైంది. చిరు జల్లు కురిసినా ఉక్కపోతతో జనం ఇబ్బంది పడ్డారు. ఆకాశం మేఘావృతమైనా ఎండ తీవ్రత ఎక్కువే ఉండడం గమనార్హం.

Updated Date - Apr 18 , 2024 | 11:58 PM