Share News

చేతులు మారిన ‘టానిక్‌’

ABN , Publish Date - Mar 06 , 2024 | 04:13 AM

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఉన్న ‘టాని క్‌’ ఎలైట్‌ వైన్‌ షాపులో జీఎస్టీ అధికారులు చేపట్టిన సోదాల్లో కొత్త విషయాలు బయటపడుతున్నాయి. టానిక్‌ షాపు మొదటి యజమానులైన బీఆర్‌ఎస్‌ నేతలు..

చేతులు మారిన ‘టానిక్‌’

ఓడిపోగానే షాపును అమ్మేసుకున్న బీఆర్‌ఎస్‌ నేతలు

అంతకుముందు నుంచే ఎలైట్‌ వైన్‌షా్‌ప అక్రమ మార్గం

రెండో రోజు కూడా ‘టానిక్‌’లో జీఎస్టీ అధికారుల తనిఖీలు

హైదరాబాద్‌, మార్చి 5(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఉన్న ‘టాని క్‌’ ఎలైట్‌ వైన్‌ షాపులో జీఎస్టీ అధికారులు చేపట్టిన సోదాల్లో కొత్త విషయాలు బయటపడుతున్నాయి. టానిక్‌ షాపు మొదటి యజమానులైన బీఆర్‌ఎస్‌ నేతలు.. రాష్ట్రంలో ఆ పార్టీ ఓడిపోగానే షాపును అమ్మేసుకున్నట్లు తేలింది. ప్రస్తుతం షాపు.. కొత్త యాజమాన్యం చేతుల్లో ఉందని తెలుసుకుని జీఎస్టీ అధికారులు విస్తుపోయారు. 2016లో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ‘ఏ-4 ఎలైట్‌ వైన్‌ షాపు’ కింద టానిక్‌కు లైసెన్స్‌ జారీ చేసింది. రాష్ట్రంలోని ఏ ప్రాంతం నుంచైనా, దేశంలోని ఏ రాష్ట్రం నుంచైనా రకరకాల మద్యం బ్రాండ్లను తెచ్చుకుని టానిక్‌లో విక్రయించుకునేలా అనుమతులు ఇచ్చారు. 2017లో ఇది అమ్మకాలను మొదలు పెట్టింది. తదనంతరం అక్రమ మార్గం పట్టింది. మొన్నటి వరకు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే ఉండటంతో అక్రమాలు బయట పడలేదు. బీఆర్‌ఎ్‌సకు చెందిన ఒక రాజ్యసభ సభ్యుడు, ఒక ఎమ్మె ల్సీ దీని యజమానులు కావడంతో అటు రాష్ట్ర జీఎస్టీ అధికారులుగానీ, ఇటు ఎక్సైజ్‌ అధికారులుగానీ ఎలాంటి తనిఖీలు చేపట్టలేదు. రెండు నెలల క్రితం ప్రభుత్వం మారడంతో అప్రమత్తమైన ఆ నాయకులు షాపులోని తమ వాటాలను అమ్మేసుకున్నారు. ఇప్పుడు ఆ షాపును కొత్త యాజమాన్యం నడుపుతోంది. ఈ విషయం తెలియక జీఎస్టీ అధికారులు సోమవారం సోదాలు ప్రారంభించారు. నిజానికి బీఆర్‌ఎస్‌ నేతలే టార్గెట్‌గా ఈ సోదాలు ప్రారంభమైనట్లు చర్చ జరిగింది. ఇప్పుడు వారే యజమానులుగా లేరని తేలింది. కాగా, మంగళవారం కూడా జీఎస్టీ అధికారులు సోదాలు నిర్వహించారు. టానిక్‌తో పాటు దానికి అనుబంధంగా ఉన్న ‘క్యూ బై టానిక్‌’ మద్యం షాపుల్లోనూ తనిఖీలు నిర్వహించారు. జీఎస్టీ, వ్యాట్‌ ఎగవేత కోణాల్లో వివరాలు సేకరిస్తున్నారు. మద్యం బదిలీ, పన్ను చెల్లించని మద్యం అంశాలను కూడా పరిశీలిస్తున్నారు. ఈ షాపు ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు మద్యాన్ని సరఫరా చేస్తున్నట్లు వస్తున్న వార్తల కోణంలోనూ వివరాలు సేకరిస్తున్నారు. అక్కడ లభించని కొన్ని బ్రాండ్లను టానిక్‌ ద్వారా ఎగుమతి చేస్తున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.

Updated Date - Mar 06 , 2024 | 04:13 AM