Share News

నేటి బాలలే రేపటి పౌరులు

ABN , Publish Date - Mar 06 , 2024 | 11:37 PM

నేటి బాలలే రేపటి పౌరులు అని జిల్లా కలెక్టర్‌ శశాంక అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాలల పరిరక్షణ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు.

నేటి బాలలే రేపటి పౌరులు
మాట్లాడుతున్న కలెక్టర్‌ శశాంక

జిల్లా కలెక్టర్‌ శశాంక

ఆంధ్రజ్యోతి రంగారెడ్డి అర్బన్‌, మార్చి 6 : నేటి బాలలే రేపటి పౌరులు అని జిల్లా కలెక్టర్‌ శశాంక అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాలల పరిరక్షణ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలల రక్షణకు అన్ని శాఖల సమన్వయం అవసరమన్నారు. బాల కార్మికులు, బాల్య వివాహాలు, అక్రమ రవాణా, మిస్సింగ్‌ వంటి సమస్యలతో బాధపడే పిల్లలకు రక్షణ కల్పించడం కోసం అందరూ సహకరించాలని సూచించారు. ప్రతీ గ్రామం, మండలం, జిల్లా స్థాయి కమిటీలు నిరంతరం పని చేయాలని సూచించారు. చట్టాలపై గ్రామాల్లో అవగాహన కల్పించాలని చెప్పారు. బాల్య వివాహాల నిరోధానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. బాలల హక్కుల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. బడీడు పిల్లలందరూ బడికి వెళ్లేలా చూడాలన్నారు. సమాజంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పిల్లల సమస్యలను తెలుసుకొని పరిష్కరించాలని కలెక్టర్‌ సూచించారు. బాల కార్మిక వ్యవస్థ, దత్తత, పిల్లల లైంగిక నేరాలు, మత్తు పదార్థాల నియంత్రణ తదితర అంశాలపై కమిటీ సభ్యులతో చర్చించారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌, జిల్లా సంక్షేమ శాఖ అధికారి పద్మజా రమణ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ వెంకటేశ్వరరావు, డీఆర్డీఏ పీడి శ్రీలత, డీపీవో సురేష్‌ మోహన్‌, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి రామేశ్వరీ దేవి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

చెరువులు కబ్జాకాకుండా చూడాలి

జిల్లాలోని చెరువులను కబ్జాలకు గురికాకుండా చూడాలని ఇరిగేషన్‌ ఎస్‌ఈని జిల్లా కలెక్టర్‌ శశాంక ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి సంబంధించిన ఆర్డీవో, తహశీల్దార్లు, మున్సిపల్‌ కమిషనర్లు, ఇరిగేషన్‌ అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో చెరువులు కబ్జాలకు గురికాకుండా ఎఫ్‌టీఐలను గుర్తించాలని, అక్రమణలు జరగకుండా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ భూములను పరిరక్షించే బాధ్యత కూడా మనపైనే ఉందన్నారు. చెరువులను జాయింట్‌ సర్వే నిర్వహించి ఎఫ్‌టీఐలను, బఫర్లను గుర్తిస్తూ కడ్డీలను, సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. ఇలా చేయడం వల్ల కబ్జాలను అరికట్టవచ్చన్నారు. చెరువులను క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదికలు అందజేయాలన్నారు. భూములకు సంబంధించి అనాథథరైజ్డ్‌ లే అవుట్ల జాబితాను తయారు చేయాలని, ప్రభుత్వ భూములను ఆక్రమణకు గురికాకుండా చూడాలని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్లు ప్రతిమాసింగ్‌, భూపాల్‌రెడ్డి, ఆర్డీవో అనంతరెడ్డి, తహశీల్దార్లు, ఇరిగేషన్‌ అధికారులు, మున్సిపల్‌ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 06 , 2024 | 11:37 PM