Share News

నేడు, రేపు ‘భారత్‌ బచావో’ సదస్సు

ABN , Publish Date - Feb 25 , 2024 | 04:46 AM

భారత్‌ బచావో పేరుతో అఖిల భారత విద్యార్థుల సదస్సు నేడు, రేపు జరగనుంది.

నేడు, రేపు ‘భారత్‌ బచావో’ సదస్సు

హైదరాబాద్‌, ఫిబ్రవరి 24(ఆంధ్రజ్యోతి): భారత్‌ బచావో పేరుతో అఖిల భారత విద్యార్థుల సదస్సు నేడు, రేపు జరగనుంది. ఈ సదస్సు బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం ఉదయం 10 గంటలకు ప్రారంభంకానుంది. 26న బహిరంగ సభను నిర్వహిస్తామని సదస్సు ప్రతినిధులు డాక్టరు గోపినాథ్‌, గాదె ఇన్నయ్య, రమే్‌షబాబులు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం పాఠశాల స్థాయి నుంచి విశ్వవిద్యాలయాల వరకు నూతన జాతీయ విద్యా విధానం-2020లో విద్యను కాషాయి కరణం చేస్తోందని విమర్శించారు. అట్టడుగు కులాల విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేసేందుకు కుట్రలు చేస్తోందని ఆరోపించారు. ఈ సదస్సు మొదటి రోజు ‘విద్యా- కాషాయికరణ, జాతీయ విద్యావిధానం-2020, ఫాసిజానికి నమూనా’ అనే అంశాలపై చర్చ జరుగుతుంది. రెండో రోజు ‘విద్యా-వ్యాపారీకరణ, ప్రైవేటీకరణ, ఆర్‌ఎ్‌సఎ్‌స-పుట్టుక రాజకీయాలు’ అనే అంశాలపై వక్తలు ప్రసంగించనున్నారు.

Updated Date - Feb 25 , 2024 | 07:58 AM