Share News

ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో నేడు ముత్యాల ముగ్గుల పోటీలు

ABN , Publish Date - Jan 05 , 2024 | 10:59 PM

సంక్రాంతి పర్వదినం పురస్కరించుకుని ఆంధ్రజ్యోతి -ఏబీఎన్‌ నిర్వహిస్తున్న కెనరా బ్యాంక్‌ ముత్యాల ముగ్గుల పోటీలు.. పవర్డ్‌ బై ఎయిమ్స్‌ విద్యాసంస్థలు, బెంగళూరు... రియల్‌ పార్టనర్‌ స్వర్గసీమ సుకేతన ఆధ్వర్యంలో ఈనెల 6వతేదీ వికారాబాద్‌ జిల్లా, మర్పల్లి మండల కేంద్రంలో ముత్యాల ముగ్గుల పోటీలు జరగనున్నాయి. జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల ఆవరణలో శనివారం ఉదయం 9 గంటలకు ముత్యాల ముగ్గుల పోటీలు ప్రారంభం కానున్నాయి. ఈ పోటీలకు స్పాన్సరర్లుగా స్వప్న సురేష్‌, పట్లూర్‌ ఎంపీటీసీ, సూర్యోదయ రియల్‌ ఏస్టేట్‌, అక్షర అర్వో ప్యూరిఫైడ్‌ డ్రింకింగ్‌ వాటర్‌, ప్రొప్రైటర్‌ పి.అఽశోక్‌, మల్లికార్జున గిరి గ్రామం, డి.శేషుపాల్‌సింగ్‌, దత్తసాయి కన్‌స్ట్రక్షన్స్‌ వ్యవహరిస్తున్నారు. ఈ పోటీల్లో పాల్గొనే మహిళలు, యువతులు సకాలంలో మైదానికి చేరుకోవాలి.

 ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో నేడు  ముత్యాల ముగ్గుల పోటీలు
ఘట్‌కేసర్‌ గురుకుల్‌లో ముగ్గు పోటీలకు సిద్దం చేసిన గ్రౌండ్‌

వికారాబాద్‌ జిల్లా మర్పల్లిలోని జిల్లా పరిషత్‌ పాఠశాల అవరణలో పోటీలు

మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌లోని గురుకుల మైదానంలో ఏర్పాట్లు పూర్తి

రేపు రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లోని కేఎన్‌ గార్డెన్‌లో...

వికారాబాద్‌, జనవరి5 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): సంక్రాంతి పర్వదినం పురస్కరించుకుని ఆంధ్రజ్యోతి -ఏబీఎన్‌ నిర్వహిస్తున్న కెనరా బ్యాంక్‌ ముత్యాల ముగ్గుల పోటీలు.. పవర్డ్‌ బై ఎయిమ్స్‌ విద్యాసంస్థలు, బెంగళూరు... రియల్‌ పార్టనర్‌ స్వర్గసీమ సుకేతన ఆధ్వర్యంలో ఈనెల 6వతేదీ వికారాబాద్‌ జిల్లా, మర్పల్లి మండల కేంద్రంలో ముత్యాల ముగ్గుల పోటీలు జరగనున్నాయి. జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల ఆవరణలో శనివారం ఉదయం 9 గంటలకు ముత్యాల ముగ్గుల పోటీలు ప్రారంభం కానున్నాయి. ఈ పోటీలకు స్పాన్సరర్లుగా స్వప్న సురేష్‌, పట్లూర్‌ ఎంపీటీసీ, సూర్యోదయ రియల్‌ ఏస్టేట్‌, అక్షర అర్వో ప్యూరిఫైడ్‌ డ్రింకింగ్‌ వాటర్‌, ప్రొప్రైటర్‌ పి.అఽశోక్‌, మల్లికార్జున గిరి గ్రామం, డి.శేషుపాల్‌సింగ్‌, దత్తసాయి కన్‌స్ట్రక్షన్స్‌ వ్యవహరిస్తున్నారు. ఈ పోటీల్లో పాల్గొనే మహిళలు, యువతులు సకాలంలో మైదానికి చేరుకోవాలి.

మేడ్చల్‌- మల్కాజ్‌గిరి జిల్లా ఘట్‌కేసర్‌ గురుకుల్‌ మైదానాంలో..

మేడ్చల్‌(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో కెనరా బ్యాంక్‌ ముత్యాల ముగ్గుల పోటీలు...పవర్డ్‌ బై ఎయిమ్స్‌ విద్యా సంస్థలు, బెంగుళూరు... రియల్‌ పార్టనర్‌ స్వర్గసీమ సుకేతన ఆధ్వర్యంలో శనివారం మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌ గురుకుల్‌ మైదానంలో జరుగనున్నాయి. గురుకుల్‌ మైదానంలో నేడు ఉదయం 10 గంటలకు ముత్యాల ముగ్గుల పోటీలు ప్రారంభం కానున్నాయి. ఈ పోటీలకు స్పాన్పర్లుగా ఘట్‌కేసర్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ముల్లి పావనిజంగయ్యయాదవ్‌ వ్యవహరిస్తున్నారు. ఈ పోటీల్లో పాల్గొనే మహిళలు, యువతులు సకాలంలో గ్రౌండ్‌ వద్దకు చేరుకోవాలి. కార్యక్రమంలో ముఖ్య అతిధిలుగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ శరత్‌చంద్రారెడ్డిలు హాజరుకానున్నారు. ముత్యాలముగ్గుల పోటీలకు గురుకుల్‌ మైదానాన్ని అందంగా తీర్చిదిద్దారు.

కాగా, ఆయా జిల్లాల పరిధిలోని సెంటర్లలో జరిగే ముగ్గుల పోటీల్లో వేర్వేరుగా మొదటి మూడు స్థానాల్లో నిలిచే వారికి నగదు బహుమతులు అందజేస్తారు. ప్రథమ బహుమతి రూ.6 వేలు, ద్వితీయ బహుమతి రూ.4 వేలు, తృతీయ బహుమతి రూ.3వేలతో పాటు ఈ పోటీల్లో పాల్గొనే వారికి ప్రోత్సాహక బహుమతులు అందజేయనున్నారు.

రేపు రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లోని కేఎన్‌ గార్డెన్‌లో...

షాద్‌నగర్‌ అర్బన్‌,: ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌ ఆధ్వర్యంలో ఆదివారం షాద్‌నగర్‌లో జిల్లాస్థాయి ముత్యాల ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. శతాబ్ది టౌన్‌షిప్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఆర్థిక సహకారంతో ఈ పోటీలు షాద్‌నగర్‌ పరిగి రోడ్డులోని కేఎన్‌ గార్డెన్‌లో ఉదయం 9.00 గంటల నుంచి 11గంటల వరకు జరుగుతున్నాయి. రాష్ట్రస్థాయిలో ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌ నిర్వహిస్తున్న ముగ్గుల పోటీకి కెనరా బ్యాంక్‌, ఎయిమ్స్‌ విద్యాసంస్థలు బెంగుళూరు, రియల్‌ పార్టనర్‌ స్వర్గసీమ సుకేతనలు సహకారం అదిస్తున్నాయి. షాద్‌నగర్‌లో నిర్వహించే ముగ్గుల పోటీలో పాల్గొనే విజేతలకు మొదటి బహుమతిగా రూ.ఆరువేలు, రెండో బహుమతిగా రూ.నాలుగు వేలు, మూడవ బహుమతిగా మూడు వేల రూపాయలు ఇవ్వనున్నారు. అలాగే మరో ముగ్గురికి ప్రత్యేక బహుమతులుంటాయి. ఈ పోటీలకు ముఖ్య అతిథిగా షాద్‌నగర్‌ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌, మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్‌రెడ్డి, శతాబ్ది టౌన్‌షిప్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సీఎండీ కాసు శ్రీనివాస్‌రెడ్డిలు హాజరవుతున్నట్టు నిర్వాహకులు తెలిపారు. బహుమతి ప్రదాన కార్యక్రమానికి హాజరు కావాలని ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌ ప్రతినిధులు శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ను కలిసి ఆహ్వానించారు.

Updated Date - Jan 05 , 2024 | 11:00 PM