నేడు ఈద్ ఉల్ ఫితర్
ABN , Publish Date - Apr 10 , 2024 | 11:46 PM
నేడు రంజాన్ పండుగను పురస్కరించుకుని వికారాబాద్, మేడ్చల్ జిల్లాలోని ఈద్గాలు ముస్తాబయ్యాయి. పండగ నేపథ్యంలో ఈద్గాలు, మసీదుల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
రంజాన్ పండుగకు ఈద్గాలు. మసీదులు ముస్తాబు
ప్రార్థనలకు ఏర్పాట్లు పూర్తి
వికారాబాద్/మేడ్చల్ టౌన్, ఏప్రిల్ 10 : నేడు రంజాన్ పండుగను పురస్కరించుకుని వికారాబాద్, మేడ్చల్ జిల్లాలోని ఈద్గాలు ముస్తాబయ్యాయి. పండగ నేపథ్యంలో ఈద్గాలు, మసీదుల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మసీదులు, ఈద్గాలను శుభ్రం చేయించి రంగురంగుల విద్యుత్ దీపాలతో శోభాయమానంగా అలంకరించారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని ప్రార్థనా మందిరాల వద్ద నిర్వాహకులు షామియానాలు ఏర్పాటు చేశారు.మేడ్చల్ పట్టణం, అత్వేల్లిలోని ఈద్గాలను శుభ్రం చేయించారు. ముకుంద్ థియేటర్ వద్ద ఈద్గాను మసీదుకు నిర్వాహకులు రంగులు వేయించి మున్సిపల్ సిబ్బందితో పరిసరాలను శుభ్రం చేయించారు. మేడ్చల్ పట్టణంలో ముస్లింలు అత్యధికంగా ఉన్నదున అందరు ఒకే సమయంలో ఒకే చోట ప్రార్ధనలు చేసే వీలు లేక పోవటంతో ప్రార్ధనలు నిర్వహించే సమయాన్ని మార్చారు. రంజాన్ పండుగ సందర్భంగా అవసరపడే వస్తువులు ఇతర వంట సామగ్రి కొనుగోలుకు ముస్లింలు పెద్ద ఎత్తున మేడ్చల్ మార్కెట్‌కు రావటంతో దుకాణాలు కిటకిటలాడాయి. మసీదులు, ఇద్గాల వద్ద మేడ్చల్ పోలీసులు ప్రత్యేకంగా భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. వికారాబాద్ జిల్లా తాండూరు, వికారాబాద్, పరిగిలో, కొడంగల్‌లలో ఈద్గాలు, మసీదులను విద్యుత్ లైట్లతో అలంకరించారు.