చిన్న జాతరకు వేళాయె..
ABN , Publish Date - Jul 15 , 2024 | 11:09 PM
అనంతగిరి శ్రీ అనంతపద్మనాభ స్వామి ఆషాడ మాస చిన్న జాతర ఉత్సవాలకు సర్వం సిద్ధం చేశారు. ఈ నెల 16న(శుక్రవారం) ధ్వజారోహణంతో ప్రారంభమయ్యే వేడుకలు ఐదు రోజుల పాటు కొనసాగనున్నాయి.
నేడు ధ్వజారోహణంతో ప్రారంభం కానున్న అనంతపద్మనాభుడి ఉత్సవాలు
ఆషాఢ మాస జాతరకు తరలిరానున్న భక్తజనం
వికారాబాద్, జూలై 15 : అనంతగిరి శ్రీ అనంతపద్మనాభ స్వామి ఆషాడ మాస చిన్న జాతర ఉత్సవాలకు సర్వం సిద్ధం చేశారు. ఈ నెల 16న(శుక్రవారం) ధ్వజారోహణంతో ప్రారంభమయ్యే వేడుకలు ఐదు రోజుల పాటు కొనసాగనున్నాయి. 21న పౌర్ణమి రోజు పెరుగు బసంతంతో జాతర ముగియనుంది. ప్రతి సంవత్సరం రెండు సార్లు జరిగే ఉత్సవాల్లో చివరి రోజు పెరుగు బసంతంలో దైవ ప్రసాదం పొంది ఆ ప్రసాదాన్ని పంట పొలాల్లో చల్లుకుంటే బంగారం పండుతుందని భక్తుల నమ్మకం. కార్తీక పౌర్ణమికి రథోత్సవంతో 11రోజుల పాటు జాతరను నిర్వహిస్తారు. ఆషాఢమాసంలో ఐదు రోజుల పాటు ఉత్సవాలు జరుపుతారు. ఈ ఉత్సవాలకు జిల్లాకు చెందిన ప్రజలే కాకుండా హైదరాబాద్, మహబూబ్‌నగర్, మెదక్ తదితర జిల్లాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలిరానున్నారు.