Share News

Manchiryāla- స్ట్రాంగ్‌రూంల వద్ద పటిష్ట భద్రత

ABN , Publish Date - May 15 , 2024 | 10:19 PM

లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి. ఈవీఎంలు భద్ర పరిచిన స్ట్రాంగ్‌ రూంల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేశామని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ అన్నారు.

Manchiryāla-       స్ట్రాంగ్‌రూంల వద్ద పటిష్ట భద్రత
కౌంటింగ్‌ కేంద్రం వద్ద భద్రత ఏర్పాట్లను పరిశీలిస్తున్న కలెక్టర్‌ సంతోష్‌

హాజీపూర్‌, మే 15: లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి. ఈవీఎంలు భద్ర పరిచిన స్ట్రాంగ్‌ రూంల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేశామని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ అన్నారు. బుధవారం మండలంలోని ముల్కల్లలోని ఐజా ఇంజనీరింగ్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్‌ కేంద్రంలో గల స్ర్టాంగ్‌ రూమ్‌ వద్ద భద్రత ఏర్పాట్లు, కంట్రోల్‌ రూంలను నోడల్‌ అధికారి గంగారం, హాజీపూర్‌ తహసీల్దార్‌ సతీష్‌కుమార్‌తో కలిసి ఆయన పరిశీలించారు. సీసీ కెమెరాలను పరిశీలించి, భద్రత సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జూన్‌ 4న కౌంటింగ్‌ ఉంటుందని చెప్పారు. కౌంటింగ్‌ కోసం అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేస్తున్నామని తెలిపారు. కంట్రోల్‌ రూమ్‌, మీడియా సెంట ర్‌లను ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తామని తెలిపారు. ఆయన సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Updated Date - May 15 , 2024 | 10:19 PM